హోంమంత్రి సుచ‌రిత‌పై రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు?


ఆమ‌ధ్య తాటికొండ వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కాద‌ని, ఆమె క్రైస్తవ మ‌తాన్ని స్వీక‌రించినందున‌ సామాజికవర్గానికి చెందిన మ‌హిళ‌గా కాకుండా ఎస్సీగా త‌ప్పుడు దృవ‌ప‌త్రాల‌తో ఎన్నిక‌య్యారంటూ కొంద‌రు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయటం.. ఆ ఫిర్యాదుపై స్పందించిన‌ ఆయన తక్ష‌ణ‌మే విచారణ జరిపి నివేదిక అందజేయమని కేంద్ర ఎన్నికల కమీషన్‌ను ఆదేశించటం, కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేర‌కు గుంటూరు జిల్లా కలెక్టర్ సూచ‌న‌ల‌తో 15రోజుల కిందట గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్ శ్రీ‌దేవికి  నోటీసు జారీ చేసి పిలిపించి, వివ‌ర‌ణ‌లు తీసుకోవ‌టం జ‌రిగింది. తాజాగా మంత్రులు సచురిత, వనితలు  విషయం కూడా తెర‌పైకి రావ‌టంతో వారిపై ఫిర్యాదు చేయకుండా మా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయటం ఏమిటంటూ శ్రీదేవి అనుచరులు మండిపడుతున్నారు.
ఈ క్ర‌మంలోనే మా శ్రీదేవి ఒక్కరే క్రైస్తవ మతస్థురాలా..?  మంత్రులు సచురిత, వనితలు క్రైస్తవ మతానికి చెందని వారు కాదా…? అంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని విన‌వ‌స్తోంది.  హోంమంత్రి సుచరిత దళిత సామాజికవర్గానికి చెందిన వారు కాదని, ఆమె పుట్టుకతోనే క్రైస్తవ సామాజికవర్గానికి చెందిన వారని,ఇదే విషయం ఆమె స్వయంగా ఒక ఇంటర్యూలో చెప్పిన విష‌యానికి సంబంధించిన వీడియోను జ‌త‌ప‌రిచి దేశ ప్ర‌ధ‌మ పౌరుడికి పంపార‌ని స‌మాచారం.
శ్రీదేవి పై కుల ఆరోప‌ణ‌లు బైట‌కు వ‌చ్చిన నేప‌ధ్యంలో అప్పటి నుండి సుచరిత హిందూ దేవాలయాలకు వెళ్లటం,అక్కడ కొబ్బరి కాయలు కొట్టి తీర్ధ ప్రసాదాలు తీసుకోవ‌టం బొట్టు పెట్టుకుని ఫొటోలు తీయించుకుని పత్రికలలో వేయించుకోవటం చేస్తున్నార‌ని నిజానికి  సుచరిత క్రైస్తవ మతస్థురాలేనంటూ ఆమె బంధుమిత్రులు చెబుతుండ‌టం విశేషం.
ఈ క్ర‌మంలోనే సుచ‌రిత క్రైస్తవ మతస్ధురాలన్న ఆధారాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి. ఫిర్యాదు దారుల దగ్గర ఎలాంటి వీడియో లున్నాయ‌న్న విష‌యంపై ప‌లువురు అనుమానితులను అదుపులోకి తీసుకోవాల‌ని హోం మంత్రే పోలీసుల‌కు మౌఖికంగా ఆదేశించార‌ని విన‌వ‌స్తోంది. త‌న కులాన్ని, మ‌తాన్ని ప్ర‌శ్నించే హ‌క్కు ఎవ‌రికీ లేదంటూ, క్రైస్త‌వ మ‌తం తీసుకుంటే త‌ప్పేంట‌ట‌? అంటూ మీడియాలో ఆమె చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు సైతం రాష్ట్ర ప‌తి దృష్టికి తీసుకువెళ్లే ప‌నిని బిజెపి నేత‌లు చేస్తున్నార‌ట‌.
ఈ నేపధ్యంలో రాష్ట్రపతి శ్రీదేవి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తీసుకుని కేంద్ర ఎన్నికల కమీషన్‌ను ఆదేశిస్తారా… లేదు వేరే ఏ నిర్ణయమైనా తీసుకుంటారా వేచిచూడాల్సిందే. 

Leave a Reply

Your email address will not be published.