వర్మ పై మనసు గాయిత్రి గుప్తా..!

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను పెళ్లాడాలనుకున్నానంటూ నటి గాయత్రీ గుప్తా చేసిన కామెంట్లు తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మీటూ సమయంలో గాయత్రి అనేక చర్చలలో పాల్గొని తనదైన వాదన వినిపించిన విషయం విదితమే తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె అనేక విషయాలపై స్పందించారు. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని . శ్రీరెడ్డి చెపుతున్నది వాస్తవమేనని తను అంగీకరిస్తున్నానని అన్నారు. అయితే తాను శ్రీరెడ్డితో మాట్లాడినప్పుడు ఈ రచ్చతో కలిగే ప్రయోజనాలేమిటో తనకు అర్ధం కాలేదని చెప్పుకొచ్చారు. నిజానికి ప్రతి రంగంలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పెరుగుతూ వస్తోందని, అయితే ఇద్దరి ఇష్టం మీదనే అది ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు గాయత్రి. నిజానికి ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు లేకుండా పోయాయని, మీటూపై గళమెత్తినందునే తనవైపు నిర్మాతలు రావటంలేదని వ్యాఖ్యానించారామె.
రామ్‌గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ ఆయనతో నేను ఐస్‌క్రీమ్ 2లో పనిచేశాను. ఆయనతో చేస్తుంటే సినిమా చేసినట్టు కాదు మారథాన్‌లో ఉన్నట్లే ఉంటుందని, ప్రతి అంశాన్ని అనువణువూ పరిశీలించాకే తన అభిప్రాయం వ్యక్తం చేసే చాలా మంచి వ్యక్తి అని అన్నారు గాయత్రి. తన కంటే ఆయన ఎక్కువ వయసున్నవాడని, లేకుంటే ఆతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యేదానినని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వర్మ అంటే తనకు ఎంతో గౌరవం ఇప్పటికీ ఉందని, వివాదాలు మనం ఆతని మాటల్ని తీసుకునే తీరుగా ఉంటాయని, నిజానికి అలాంటి వ్యక్తి ఉంటే తన జీవితం చాలనిపించిన సందర్భం కూడా ఉందని ఆమె తెలిపారు.