అమిత్ షాపై అమెరికా ఆంక్ష‌లువివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును‌ తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా యూఎస్ ఫెడరల్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.  హిందూ రాజ్యమే స్థాపనగా ముందుకు సాగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌ర‌పున  కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్‌షా ఈ బిల్లును సభ ముందుంచగా అనేక వాదోప‌వాదాల న‌డుమ పౌరసత్వ సవరణ బిల్లును సోమవారం రాత్రి లోకసభలో ఆమోదించిన విష‌యం విదిత‌మే. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, శివసేన, టీఆర్ఎస్ వ్యతిరేకించడంతో పాటు పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.  సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 80 మంది ఓటేసి ఆమోదముద్ర వేశారు.
కాగా దీనిపై ఇప్పటికే ఈ బిల్లుపై యూఎస్ కమిషన్స్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం (యూఎస్‌సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుద‌ల చేసింది.  ఈ బిల్లు భార‌త  లోకసభలో ఆమోదించారని, ఇక‌ రాజ్యసభలో ఆమోదం పొందింతే, హోం మంత్రి అమిత్‌షాతో స‌హా  ఇతర బిజెపి పెద్దలపై ఆంక్షలు విధించే విషయాన్ని అమెరికా తీవ్రంగా పరిశీలిస్తుందని యూసీఐఆర్ఎఫ్ పేర్కొన‌టం గ‌మ‌నార్హం.  
వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే బిల్లులో ముస్లింలను మినహాయించడం అంటే దేశంలో మతప్రాతిపకన‌ పౌరసత్వం కల్పించాల‌ని భార‌త ప్ర‌బుత్వం చూస్తున్న‌ట్టు స్పష్టమవుతోందని తెలిపింది. ఈ  వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును రాజ్య స‌భ సైతం ఆమోదం పొందిన తరువాత మంత్రి అమిత్‌షా‌, ఇత‌ర బిజెపి పెద్ద‌ల‌పై అమెరికా ఆంక్షలు విధించక తప్పదని అంటోంది.

Leave a Reply

Your email address will not be published.