ఘోర రోడ్డు ప్రమాదం రెండు కార్లు ‘డీ’ నలుగురు మృతితూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి.. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం బాధితుల్ని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం దెబ్బకు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనలో ఓ కారు ఇంజిన్‌ ఊడి బయటకు వచ్చేసింది అంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ వైపుగా వెళుతున్న కారు ఒక్కసారిగా డివైడర్‌ దాటి దూసుకొచ్చింది. అవతలివైపు రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారట. ప్రమాదానికి కారణమైన కారులో వ్యక్తులు మద్యం సేవించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పండుగ రోజు నలుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published.