పరారే హీరో ఉద‌య్ హ‌ఠాన్మ‌ర‌ణం

పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా న‌టించిన యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34)   శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించ‌డంతో ఆత‌ని కుటుంబం విషాదంలో మునిగి పోయింది. . పలు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్న ఉద‌య్ శంక‌ర్ అనంత‌ర కాలంలో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి డ్రగ్స్ కేసులోనూ అరెస్టై జైలు జీవితం గడిపాడు. 
ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉదయ్‌ కిరణ్‌ పలు నేరాలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని ఓవర్ ద మూన్ పబ్‌లో 2016లో జ‌రిగిన‌ గొడవ ఆత‌ని అరెస్టుకు దారి తీసింది. అయితే త‌న మానసిక పరిస్థితి సరిగా లేదంటూ  ఉదయ్‌ కిరణ్ చెప్ప‌డంతో ఆమేర‌కు పోలీసులు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు కూడా. అలాగే నందగిరిహిల్స్‌లో ఇంటి యాజమానిపై దౌర్జన్యం కేసులోనూ ఉద‌య్ ప్ర‌ధాన ముద్దాయిగా ఉన్నాడు.  దీంతో పాటు కాకినాడకు చెందిన ఓ మహిళకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులోనూ అరెస్టయ్యాడు. ఇలా ప‌లు కేసుల‌లో ఇరుక్కున్న ఉద‌య్‌పై ప‌లు అభియోగాలు, క్రిమిన‌ల్ కేసులున్న‌ట్టు స‌మాచారం. 
 కాకినాడలో త‌న స్వ‌గృహంలో శుక్ర‌వారం రాత్రి భోజ‌నాల త‌దుప‌రి త‌న‌కు శ్వాస పీల్చుకోవ‌టం ఇబ్బందిగా ఉంద‌ని ఇంట్లో వారికి చెప్పాడు. ఆత‌న్ని ఆసుప‌త్రికి తీసుకెళ్లే లోపే మరణించాడు.  గుండెపోటు కార‌ణంగానే అతడు మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. ఉదయ్‌కిరణ్‌ పార్థివ దేహాన్ని సంద‌ర్శంచిన‌ పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. 

Leave a Reply

Your email address will not be published.