పవన్ స‌ర‌స‌న అంజలి?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ తెలుగు రీమేక్ తో రీ ఎంట్రీ ఆరంభంకానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. జనవరి 10 నుంచి ఈ సినిమా కార్యక్రమాలు ఆరంభంకానున్నాయి. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడనే వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉంటే. ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిల పాత్రల కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా నివేధా థామస్ ని ఓ పాత్ర కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో అమ్మాయి పాత్ర కోసం అంజలిని తీసుకున్నారని సమాచారమ్. తమన్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.