మెగా బ్రదర్స్‌కు అల్లు బ్రదర్స్ పోటీనా

మెగా బ్రదర్స్‌ని ఒకే వేదిక మీద చూడటం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో ఒకసారి వీరి ముగ్గురినీ ఒక వేదిక మీద చూశారు ఫ్యాన్స్ ఆ తర్వాత ఇన్ని రోజులకి ఇప్పుడు అల్లు ఫ్యామిలీ హీరోలు ముగ్గురూ ఒకే వేదిక మీద కనిపంచడంతో కాస్త ఆసక్తికరంగా మారింది. వీరు ముగ్గురు కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఒకేసారి ముగ్గురిని వేదిక మీద చూడడంతో అల్లు ఫ్యాన్స్‌కి కన్నుల పండుగగా అనిపించింది. మెగా హీరోలను చూసి ఎలాగయితే ఫ్యాన్స్ ఆనందపడతారో ఇప్పుడు ఈ అల్లు బ్రదర్స్‌ని చూసి అంతే ఆనందపడుతున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది. అనుకుంటున్నారా ఈ రోజు జరిగే అలవైకుంఠపురం ఈవెంట్లో ఈ ముగ్గురు కలిసి ఫ్యాన్స్‌కి సందడి చేశారు. ఒకే వేదిక మీద ముగ్గురు సెలబ్రెటీలను చూడటం అంటే మాములు విషయం కాదు.
జనవరి 12 న టీజర్ విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. చాలా టైం గ్యాప్ తరువాత అల్లుఅర్జున్ ఈ సినిమాతో వస్తుండటం, మరో వైపు మాటల మాంత్రికుడు దర్శకత్వం వహించటంతో అటు బన్నీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అతృతతో ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడీ సినిమా నుంచి బన్నీ అభిమానులకి ఓ సప్రైజ్ ప్లాన్ చేశారు నిర్మాతలు.తాజాగా థమన్ ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ సినిమా ప్రమోషనల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో తమన్ మాత్రమే కనిపిస్తారా? లేక బన్ని కూడా దర్శనమిస్తారా? తెలియాలంటే ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే.