ఏపికి న్యాయం చేయండి…… స్వతంత్ర నిపుణుల బృందం…
ప్రజాస్వామ్య పీఠం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హమీలు ప్రస్తుత స్ధితిపై లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో విజయవాడలో సమగ్ర నివేదికను విడుదల చేశారు. ఆయా అంశాలపై అధ్యయనానికి ప్రత్యేక కమీటీగా ఏర్పడిన నిపుణుల బృదం అన్ని అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఈ కమీటీ అధ్యయన రిపోర్టును అటు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు పంపడంతోపాటు అన్ని రాజకీయ పార్టీలకు అదిస్తామని అపరిషృత సమస్యల పరిష్కారానికి పలు సూచనలు వారికి వివరిస్తామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కోన్న అంశాలు ఇచ్చిన హమీలకు సంభందించి సమగ్రమయిన నివేదికను ప్రజాస్వామ్య పీఠం సిద్దం చేసింది. దీనికోసం ఆర్దిక వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, కేంద్ర సర్వీసుల్లో కీలక పదవుల్లో పనిచేసిన వారితో పాటు న్యాయ మూర్తులతో ఈ బృందాన్ని ఏర్పాటుచేశారు. విభజన జరిగిన సమయం, తరువాత వచ్చిన మార్పులు వంటి వాటిపై సునిశితంగా అధ్యయనం చేసిన వీరు పలు సూచనలు చేసినట్టు బృందాన్ని సమన్వయం చేసిన లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. విభజన చట్టంలో కొలువయిన వివిధ అంశాలపై బృంద సభ్యులు సవిరంగా వివరించగా అతి కీలకం అయిన ఆర్ధిక లోటు అంశాన్ని మాజీ ఐ ఏ ఎస్ అధికారి అజయ్ కల్లాం వివరించారు. నిజానికి ఆంద్రప్రదేశ్ లో అప్పటికే చెల్లించిన మొత్తన్ని కూడా కలిపితే రెవెన్యూలోటు 19,015కోట్ల రూపాయలు కాగా దీనిలో 10, 335 కోట్ల రూపాయలును 31 మార్చి 2015 నాటికి కేంద్రం చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన 8,660 కోట్ల రూపాయలు మాత్రం ప్రభుత్వం తీసకున్న కోత్త పధకాల అయిన బుణమాఫీ, డిస్కామ్ లకు ఆర్ధిక చేయూత, సామాజిక భద్రతా పించన్లు, లాంటి వాటి విషయంగా ఇవ్వలేకపోతున్నామని కేంద్రం ప్రకటించింది.అటు అంతకుముందు ప్రభుత్వం ఇవ్వాల్సిన పిఆర్ సి బకాయిలు విషయంలో కూడా కేంద్రం భాద్యత తీసుకోకపోవడం సమంజసం కాదన్నారు. ఇదిలా ఉంటే తోలి ఏడాది ఏపి రివెన్యూలోటు 16,078కోట్లు రూపాయలు కాగా దానికి అంగీకరించని కేంద్రం చెల్లిస్తామని చెప్పిన 4117 కోట్లుకు గాను 3979 కోట్లు రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని అజయ్ కల్లాం వివరించారు.ఈ బృందంలోని మరో సభ్యుడు జస్టీస్ సుంకవల్లి పర్వతరావు విభజన చట్టంలో కొన్ని కీలక అంశాలపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎక్కడి కేంద్రకార్యాలయాలు ఉంటే అక్కడి సంస్ధులుగా పన్నల చెల్లింపు జరుగుతుందని ప్రకటించడంతో అటు ఆంద్రప్రదేశ్ 3820 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోవలసి వచ్చిందన్నారు. ఇదే సమయంలో అటు అప్పలు విషయంలో మాత్రం జనాభా ప్రాతిపదికన విభజించడం మూలంగా ఏపికి తలకు మించిన భారంగా మారిందని ప్రకటించారు. అటు పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా వరకూ ప్రగతి జరిగిందని కమీటీ సభ్యులు కేంద్ర హోంశాఖమాజీ కార్యదర్శి పద్మనాభయ్య పేర్కోన్నారు. కేంద్రం నుండి ఇంకా 3340 కోట్లు రియంబర్స్ కావాల్సి ఉందన్నారు. ఫేజ్ 1లో 41.15మీటర్లు డ్యంను కట్టడానికి మెయిన్ వర్క్స్ కోసం 8716 కోట్లు రావాల్సి ఉందన్నారు. 2019-20 డిసెంబర్ వరుకు 27494కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇండియాలో మొత్తంగా 16 జాతీయ ప్రాజెక్టులు ఉండగా పోలవరం మాత్రం చాలా స్పీడుగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవ్వలంటే ముందు స్టేట్ గవర్నమెంట్ ఖర్చచేయడం కష్టంగా మారింది. దీంతో ప్రతి క్వార్టర్ కు డబ్బు 90 శాతం కేంద్రం ఇచ్చి లెక్కలు అడిగితే బావుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వివిధ సంస్ధల కేంద్ర కార్యాలయాలు ఎక్కడ ఉంటే పన్నులు కూడా అక్కడికే వెళుతాయి అని నిర్ణయం తీసుకోవడంతో ఏపి ఇప్పటి వరకూ 16445 కోట్లు నష్టపోయిందని కమీటీ సభ్యలు అభిప్రాయపడ్డారు. దీనిలో 90శాతం రాష్ట్రాలకు రావాల్సి ఉందన్న వారు ఏపికి న్యాయం జరగడం లేదన్నారు, అయితే ఈ ప్రతిపాదననే పక్కన పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం వద్దకు ఎన్నికల తరువాత వెళ్ళి మాటాడాలని సూచించారు. ఎక్కడయితే రిజిష్టర్ అయ్యిందో అక్కడే దాని ఆదాయం అనకుండా ఉత్పత్తి జరిగే ప్రదేశం నుండి తీసుకోవాలని సూచిస్తున్నారు.ఎన్నికల ముందు రెండు నెలల్లోనే విభజన చట్టం రాగా విభజన చట్టంలో పేర్కోన్నాట్టు ఏపికి ఓడరేవుపై మూడు ప్రాంతాలలో ఏదో ఒక చోట ఇవ్వాలని పేర్లు సూచించారు. నక్కపల్లి, రామయణపట్నం, దుగ్గరాజపట్నం లను రికమెండ్ చేయగా. వీటిలో దుగరాజపట్నంకు శ్రీహరికోట, పులికాట్ లేక్ కు అత్యతం సమీపంగా ఉండడం తో అక్కడ పోర్టు సాధ్యం కేంద్రం పేర్కోటోంంది. అయితే మన ఎంపిలు ఇన్ఫ్లు ఎన్స్ చేసి దుగిరాజపట్నం కు ఓకే చేయించారన్నారు. అయితే దుగిరాజపట్న వద్ద పోర్టు సాధ్యం కాదని తరువాత నిపుణులు అభిప్రాయపడడంతో అది అంతలో ఆగిపోయింది. దీంతో కేంద్రమే దీనిపై ఓనిర్ణయాన్ని ప్రకటించాలని మాజీ న్యాయమూర్తి సుంకవల్లి పర్వతరావు, అజయ్ కల్లాం.
రాష్ట్రానికి కేటాయించిన 11 జాతయస్ధాయి విద్యాసంస్ధలకు 12746కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా దానిలో ఇప్పటివరకూ కేవలం 6.6శాతం మాత్రమే వచ్చిందన్నారు. రాష్ట్రం ఇప్పటికే ఆయా సంస్ధల నిర్మాణానికి అవసరం అయిన భూమలును కేటాయించింది. అటు అమరావతిలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకోసం విభజన చట్టం షెడ్యూల్ 30 లో ఉందన్నరు. దీంతో అయిదు ముఖ్యమయిన రోడ్లను గుర్తించి కేంద్రానికి పంపింది. హైదరాబాద్ నుండి విజయవాడ ఫోర్ లైన్ ను సిక్స్ లైన్ గామర్చడం. హైదరాబాద్ నుండి అమరావతికి ఎక్సప్రెస్ హైవే డిపిని సిధ్దం చేయడం. అటు రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో టోకెన్ నగదు మాత్రమే రిలీజ్ చేయడంతో ఈ ప్రాజెక్టు పూర్తికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అని అనుమానిస్తున్నారు. అటు చెన్నై – విశాఖ పట్నం కారిడార్ కు 12000 కోట్లు అవసరం అవుతాయి. దీనిలో6000కోట్లు కనీసం వస్తే బావుంటుంది అని వారు అభిప్రాయపడ్డారు. మెట్రో రైల్ విజయవాడ, విశాఖ పట్నంకు ప్రకటించినా కేంద్రంలో కదలిక లేకపోవడం పట్ల ప్రోఫెసర్ గాలిబ్ , మా కేంద్ర హోం సెక్రటరీ పద్మనాభయ్యలు తప్పుపట్టారు.