ఎన్నికల వేళ బీసీల బాట!

గడచిన నాల్గున్నరేళ్లుగా బిసి ల ఊసెత్తని టి డి పి ఎన్నికలు దగ్గరి కి వస్తున్న వేళ సడన్ గా
 బిసి లపై  ఎక్కడలేని ప్రేమా పుట్టుకొచ్చి వరాల జల్లు కురిపిస్తుంది. ఈ నెల 27 న రాజమహేంద్రవరం లో నిర్వహించిన ‘జయహో బిసి ‘ పెరిట నిర్వహించిన సభలో బీసీ లకు అనేక హామీలు ఇచ్చింది. అవన్నీ ఆచరణ సాధ్యమా కాదా తర్వాత విషయం, గత ఎల్లెక్షన్ లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి ఇప్పటికి పూర్తి గా అమలు చెయ్యలేక పోయింది. ఇప్పుడు బిసి లకు ఇచ్చిన హామీలు బీసీ ల ఓట్లు కొల్లగొట్టటానికి తప్ప ఏమాత్రం చిత్తశుద్ధి తో చేస్తున్నది కాదన్నది సుస్పష్టం. ముఖ్యమంత్రి కులాలని ప్రస్తావించి ఆయకులాల అభివృద్ధి కోసం ఇప్పుడున్న పెడరేషన్ స్తానం లో కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు కొత్తగా ప్రకటించిన వరాలకు 
3 వేల కోట్లు అవుతుందని అంచనా, నిజం గా చంద్రబాబు ప్రభుత్వం అంత ఖర్చుచేస్తుందా అంటే ఎంతమాత్రమూ కాదని గత నాలుగేళ్ల బడ్జెట్ కేటాయింపులను చూస్తే అర్ధమౌతుంది.ఇలాంటి ప్రభుత్వం ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం, బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పిస్తాం అని బూటకపు కబుర్లు చెప్పి ప్రజలను నమ్మించగలరా!  వేచి చూద్దాం.  

Leave a Reply

Your email address will not be published.