`అలా వైకుంఠ‌పురంలో` చిత్రం ఆ గండం దాట‌గ‌లిగితే…?


ఒక చిత్రం క‌థ క‌థ‌నాలు బావుంటే నిడివి కాస్త ఎక్కువ‌గా ఉన్నా ప‌ర్లేదు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. కానీ ఏమాత్రం కాస్త అటూ ఇటూ అయినా చూసే క‌థ ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకోలేక‌పోతే మాత్రం ల్యాగ్ ఉంద‌ని, బోర్ కొట్టిస్తుంద‌ని డిసైడ్ అయిపోతున్నాడు. ఈ క్ర‌మంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టించిన `అర్జున్‌రెడ్డి` రాంచ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` చిత్రాలు నిడివి కాస్త ఎక్కువైనా ప్రేక్ష‌కుడ్ని ఆకట్టుకోవ‌డంతో అవి బాక్సాఫీస్ ముందు సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌య్యాయి.   అయితే మిగతా చిత్రాల పరిస్థితి ఎలా వున్నా ఇపుడు అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `అలా వైకుంఠపురంలో` చిత్రానికి ఇదే సమస్య వచ్చిందట. సినిమా నిడివి రెండు గంటల 25 నిమిషాలు అని అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చెప్పినప్పటికీ అలా కుదరలేదట. ముఖ్య సన్నివేశాలతో పాటుగా, కామెడీ, యాక్షన్ సీన్లు ఈ చిత్రంలో చాలా ఉన్నాయని సమాచారం.


అయితే `నా పేరు సూర్య` అల్లు అర్జున్ చిత్రం ప్లాప్ అవ్వడానికి కూడా ముఖ్య‌ కారణం ఇదేనని అబిప్రాయపడుతున్నాడట. ఎట్టి పరిస్థితిల్లో `అలా వైకుంఠపురలో` చిత్ర నిడివి తగ్గించడానికి అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్ర నిడివి ఎంతకి కుదించుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ ఒక్క గండం దాటేస్తే అల్లు అర్జున్ పక్కాగా హిట్ కొడతానని ఈ చిత్రం విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. ఈ చిత్రం సంక్రాంతికి 2020 న విడుదల కానుంది. మ‌రి నిడివి త‌గ్గించేందుకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ అంగీక‌రిస్తాడా ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది అన్న‌ది తెలియాల్సి ఉంది. 

Leave a Reply

Your email address will not be published.