వాడి తగ్గని వనిత..అంతర్జాతీయ టైటిల్‌ని సునాయాసంగా గెలుచుకుంది.తల్లి అయ్యాక టెన్నీస్ కోర్ట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జా తనలో చావ ఏమాత్రం తగ్గలేదని తన సత్తా చాటుకుంది. తాజాగా సానియా ఆడిన తొలి అంతర్జాతీయ టైటిల్‌ని సునాయాసంగా గెలుచుకుంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల డబుల్స్ టైటిల్‌ని సానియా జోడి సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సానియా మిర్జా నదియా కిచెనోక్(ఉక్రెయిన్) జోడి రెండో సీడ్ జాంగ్ షూపెంగ్ షూ(చైనా) జోడిని 64, 64 వరుస సెట్లలో మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకుంది. చైనా జోడి ఏ దశలోనూ సానియా జోడికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. శుక్రవారంనాటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సానియా జోడి 76, 62 తేడాతో మేరీ బౌచ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌)జిదాన్సెక్‌ (స్లొవేనియా)లపై గెలిచారు. చివరగా 2017లో చైనా ఓపన్‌లో 33 ఏళ్ల సానియా మిర్జా ఆడింది.

Leave a Reply

Your email address will not be published.