ప్రేమికులు….. గొడవలు పడ్డారు!

యువహీరో అర్జున్ కపూర్ మలైకా అరోరాఖాన్ ఎఫైర్ ఇటీవల హాట్ టాపిక్. ఆర్భాజ్ ఖాన్ నంచి విడాకులు తీసుకున్న మలైకా సదరు కుర్రహీరోతో రొమాన్స్ సాగించడం.. ఆ ఇద్దరూ కలిసే పార్టీలు, పబ్బులు అంటూ షికార్లు చేయడం సర్వత్రా వేడెక్కించే చర్చకు కారణమైంది. ఈ తెగింపు కొందరికి కంటగింపుగా ఉందన్న ప్రచారం సాగింది. ముఖ్యంగా ఆర్భాజ్ సోదరుడు కండల హీరో సల్మాన్ ఖాన్ అర్జున్ కపూర్ పై గరంగరంగా ఉన్నారని ప్రచారమైంది. సోదరి అర్పిత తో ప్రేమాయణం సాగించిన అర్జున్ అటుపై తనతో బ్రేకప్ అయ్యి.. అప్పటికే పెళ్లయిన మలైకాతో ఎఫైర్ సాగించడం సల్మాన్ కోపానికి కారణమైంది. దీంతో తనకు ఎంతో సన్నిహితుడైన బోనీకపూర్ తో సల్మాన్ స్నేహం చెడింది. అది కూడా కొడుకు వల్లనే అన్న చర్చా సాగింది. దీంతో మలైకాతో ఎఫైర్ వద్దని బోనీ వారించే ప్రయత్నం చేశారని వార్తలొచ్చాయి. ఇదంతా ఓ కోణం అనుకుంటే తాజాగా మలైకా – అర్జున్ మధ్య బ్రేకప్ అంటూ మరో వార్త బాలీవుడ్ ని వేడెక్కిస్తోంది. ప్రేమికుల రోజున ఈ ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సైలెంట్ గా ఉన్నారు. పైగా సింగిల్ గా ఉన్న ఫోటోల్ని మాత్రమే ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో ఆ ఇద్దరి పైనా కొత్త పుకార్ వేడి పెంచుతోంది. అయితే స్నేహానికి పరిమితమయ్యాడా.. లేక బ్రేకప్ చెప్పేశాడా? అన్నది కొద్ది రోజుల్లో బయటపడుతుందేమో!
ఆ జంట కూడానా?
మరోవైపు బాలీవుడ్ యంగ్ కపుల్ రణబీర్  – ఆలియా భట్ మధ్య లవ్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా విడదీయలేనంత ఘాడానుబంధం పెనవేసుకుంది. ఒకరికోసం ఒకరు పరితపించిపోతారు. ఇరువైపులా కుటుంబీకులకు ఆ ఇద్దరి స్నేహం ఇష్టమే. ఆ జంట పెళ్లికి సిద్ధమే. తొందర్లోనే పెళ్లికి బాజా మోగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఒకటే ప్రచారం సాగింది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఈ కొత్త రూమర్  వేడెక్కిస్తోంది. ఆ ఇద్దరి మధ్యా గొడవ జరిగింది! అంటూ ముంబై మీడియా ఆసక్తికర కథనాలు వేడెక్కిస్తున్నాయ్. అది కూడా ప్రేమికుల రోజున ఇలాంటి గొడవ గురించి బయటపెట్టింది బాలీవుడ్ మీడియా. గల్లీబోయ్ ప్రివ్యూకి రణవీర్ – దీపిక, రణబీర్ – ఆలియా జంటలుగా కలిసి వెళ్లారు. అయితే  షో అయ్యాక అసలు కథ మొదలైంది. రణబీర్ – ఆలియా జంట ఎందుకనో కలతగా కనిపించిందిట. ఆ ఇద్దరూ షో ముగిసిన తర్వాత తమ కార్ ఎక్కారు. కానీ ఏదో జరిగింది. ఆ ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దాంతో ఆ ముఖాల్లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. అసలింతకీ ఆ ఘర్షణ ఏంటి? అంటూ ఒకటే హడావుడి చేసేసింది మీడియా. ౠగల్లీ బోయ్‌ౠ చిత్రంలో రణవీర్ సింగ్ – ఆలియా జంట హాట్ హాట్ గా నటించారు. ఆ ఇద్దరి మధ్యా లిప్ లాక్ సీన్స్, వేడెక్కించే సన్నివేశాలకు కొదవే లేదు. అయితే ఆలియా ఫ్రీడమ్ విషయంలో రణబీర్ అడ్డు చెప్పాడా?  గొడవ పడ్డాడా? అన్న కోణం ఇందులో ఉందా.. అంటూ సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోంది అన్న సందేహాన్ని సదరు కథనాలు వేడెక్కించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published.