హీరో ఆఫ్ ద డెకేడ్.. ఎవరంటే…?ఏ ఇండ‌స్ట్రీలోనైనా స‌రే హీరోలు బానే ఉంటారు వాళ్ళ ప్యాన్స్ మాత్రం ఎప్పుడూ బేధాభిప్రాయాల‌తో ఉంటారు. ఎప్పుడు చూసినా మేం గొప్ప అంటే మేం గొప్ప అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తుంటారు. ఇక ఇయ‌ర్ ఎండిగ్ వ‌చ్చేసింది. హీరో ఆఫ్ ద ఇయ‌ర్ ఎవ‌రో తేల్చే ప‌నిలో మ‌ళ్ళీ ఈ ర‌చ్చ మొద‌లైంది. ఆ ఏడాదిలో ఎవరి సినిమా పెద్ద హిట్టయి ఉంటే.. వాళ్లే హీరో ఆఫ్ ద ఇయర్ అవుతుంటారు. దీన్ని తేల్చడం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు ఈ పోల్స్, చర్చలు 2019కు పరిమితం కావడం లేదు. 2010 నుంచి 2019 వరకు దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ‘హీరో ఆఫ్ ద డెకేడ్’ ఎవరో తేల్చే పనిలో పడ్డారు మన హీరోల ఫ్యాన్స్.

ఒక పోటీ విష‌యానికి వ‌స్తే  మొత్తం అర‌డ‌జ‌న్ హీరోల మ‌ధ్య జ‌రుగుతుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. వీళ్లే ఆ ఆరుగురు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ కూడా పోల్స్‌లో అంత ఉత్సాహంగా పాల్గొనట్లేదు. ఐతే ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ లాంటి భారీ హిట్లతో పవన్ గట్టిపోటీదారనే చెప్పాలి. మహేష్ విషయానికి వస్తే.. ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’ లాంటి తిరుగులేని విజయాలు అతడి ఖాతాలో ఉన్నాయి. కాకపోతే గతంతో పోలిస్తే అతడి మార్కెట్ ఈ మధ్య దెబ్బ తింది. గత కొన్నేళ్లలో రొటీన్ క్యారెక్టర్లు చేసి మహేష్ నెగెటివిటీ కూడా పెంచుకున్నాడు. అల్లు అర్జున్ గత దశాబ్దంలో భలేగా ఎదిగాడు. పదేళ్ల కిందట అతను మామూలు స్టారే. కానీ గత దశాబ్దంలో అంచెలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ అయ్యాడు.
జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ పరంగా మిగతా అందరినీ వెనక్కి నెడుతాడు. సక్సెస్ రేట్ కూడా బాగుంది. ఐదేళ్ల ముందు తారక్ రేంజి చాలా తక్కువ. కానీ‘టెంపర్’ దగ్గర్నుంచి అతను వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.  ఐతే రామ్ చరణ్ ‘రంగస్థలం’తో నాన్ బాహుబలి హిట్ కొట్టి మిగతా స్టార్లందరినీ వెనక్కి నెట్టాడు. ఇందులో తిరుగులేని పెర్ఫామెన్స్ కూడా ఇచ్చాడు. చివరగా ప్రభాస్ విషయానికి వస్తే.. సక్సెస్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్.. ఏ ప్రమాణాల్లో చూసుకున్నా.. అతడికి మిగతా వాళ్లకు పోలికే లేదు. ఇందుక్కారణం ‘బాహుబలి’. ఆ సినిమా రెండు భాగాలు ఎలాంటి విజయాలు సాధించాయో.. ప్రభాస్ రేంజ్ ఎంత పెరిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మార్కెట్ విషయంలో అందరినీ దాటి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ రకంగా చూసుకుంటే హీరో ఆఫ్ ద డెకేడ్ ప్రభాసే అని చెప్పాలి. కానీ ఈ సక్సెస్‌లో ప్రభాస్ క్రెడిట్ ఎంతన్నదే ప్రశ్నార్థకం. అదంతా రాజమౌళి పుణ్యం కాబట్టి ప్రభాస్ కూడా ఈ కిరీటాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించే పరిస్థితి లేదు. ఇంత‌కీ మ‌రి ఈ క్రెడిట్ ఎవ‌రికి వెళుతుందో మ‌న ఫ్యాన్స్ ఎవ‌రిని ముంద‌దంజ‌లో నిల‌బెడ‌తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.