గాంధీజీ స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలో ట్రంప్

గాంధీజీ స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌తీ స‌మేతంగా క‌లియ‌దిరిగి మోడీకి ధ‌న్య‌వాదాలు చెపుతూ రాసిన వ్యాఖ్య‌లు ఓవైపు సామాజిక మీడియాలో దుమారం సృష్టిస్తుంటే మ‌రికొంద‌రు ట్రంప్ సంతకాన్ని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన సంతకం అచ్చుగుద్దినట్లుగా ‘ఈసీజీ’, ‘హార్ట్ బీట్’ స్కానింగ్ అంటూ  తెగ సెటైర్లేస్తు, త‌మ‌దైన ఫోటోలు జ‌త చేస్తున్నారు. 
 ట్రంప్ సంతకం చేసిన ఫొటో   పక్కనే ఈసీజీ రిపోర్టులు పెట్టి  రెంటికీ తేడా ఏముందంటూ   కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే  ట్రంప్ విజిట‌ర్స్ బుక్‌లో ‘గ్రేట్ ఫ్రెండ్’ అని రాయ‌టాన్ని త‌ప్పుప‌డుతూ …. ‘డియర్ ఫ్రెండ్’ అని రాయాలిగా   ట్రంప్ గారూ..  అంటూ ఉచిత సలహాలు ఇవ్వ‌టం క‌నిపించింది. ఏదిఏయైనా  ట్రంప్‌గారి ఈ సంతకం నెట్టింట్లో వైరలై కూర్చుంద‌న‌టంలో సందేహం లేదు. మీటికి తెగ‌లైకులొస్తుండ‌టంతో తెగ‌ముచ్చ‌ట‌ప‌డిపోతున్నారంతా!  
 

Leave a Reply

Your email address will not be published.