ఒకే రోజు విడుద‌ల‌వుతున్న ఐదు సినిమాలు

ఫిబ్రవరి మాసంలో  7వ తేదీ సినిమా అభిమానులకు పండగ రోజు కాబోతోంది.  ఈ రోజు   ఏకంగా ఐదు టాలీవుడ్  సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండ‌టం, అందునా కొత్త‌హీరోలు చిన్న చిత్రాలు కూడా ఉండ‌టంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.  

 సవారి:
ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతం బ్యాక్ డ్రాప్‌గా  తెరకెక్కిన చిత్రం సవారి.  కాల్వ నరసింహస్వామి ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, కె. నిశాంక్ రెడ్డి నిర్మాతలుగా సాహితీ మోత్కూరి దర్శకత్వంలో ఈ చిత్రం సిద్ద‌మైంది.  ఆనంద్ కృష్ణా నందు, ప్రియాంక శర్మ హీరోహీరోయిన్లు కాగా   శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

జానూ
తమిళంలో వచ్చిన 96 చిత్రాన్ని దిల్‌రాజు తొలిసారిత‌మ సంస్ధ నుంచి రీమేక్ చిత్రంగా తెలుగుతెర‌కు  జానూగా తీసుకువ‌చ్చారు.  శర్వానంద్, సమంతా జంటగా నటించిన ఈ చిత్రానికి 96 చిత్ర ద‌ర్శ‌కుడైన  సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వ‌హించారు.   శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై   కెన్యా, విశాఖపట్నం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా   తెరకెక్కిన ఈ సినిమా ప్రేమ‌క‌థా చిత్రం కావ‌టంతో భారీ అంచ‌నాలున్నాయి.

 ‘అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి’.
హైదరాబాద్‌కు చెందిన యువతులు… స్నేహితురాలి పెళ్లి కోసం గోవా వెళ్లడం.. అక్కడ అనుకోకుండా కొన్ని విపత్కర పరిస్థితుల్లో చిక్కుకోని .. ఇబ్బందులు పడడం కథాంశంతో రూపొందిన చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి’.
 ధన్యా బాలకృష్ణ, త్రిథ చౌదరి, సిద్ధి ఇదాని, కోమలి ప్రసాద్ ప్రధాన తారాగణంగా దర్శకుడు, కథా రచయిత   బాలు అడుసుమిల్లే    ఈ సినిమాని తెర‌కెక్కించాడు.   వికాస్ బడీజా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. హిమా వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మాతలుగా పూర్వీ ఫిక్చర్స్‌తో కలసి బి అండ్ డబ్ల్యూ పిక్చర్స్  బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ సినిమా   తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.  


త్రీ మంకీ స్‌
జబర్దస్త్ షోలో బుల్లి తెరపై త‌మ‌దైన కామెడీతో, పంచ్‌ల‌తో కడుపుబ్బ నవ్వించిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్‌ల‌ని హీరోలుగా చేస్తూ  రూపొందిన‌ చిత్రం త్రీ మంకీ స్‌.  ఒరుగల్లు సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.నగేష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ జి దర్శకత్వం వ‌హించారు. కారుణ్య చౌదరి, కౌటిల్యా, ప్రియ పాల్వాయిలు ఈ చిత్రంలో క‌థానాయిక‌లు అనిల్ కుమార్. జి ఈ చిత్రానికి సర్వాలు సమకూర్చారు.


స్టాలిన్‌
రంగం చిత్రంతో తెలుగుసినిమాని ఓ ఊపు ఊపిన త‌మిళ న‌టుడు జీవా తాజాగా  వి.కె.ఆనంద్ దర్శకత్వంలో  హీరోగాన‌టించిన సినిమా స్టాలిన్. ఈ చిత్రంలో వరుణ్, రియా సుమన్, గాయత్రి కృష్ణన్ కీలక పాత్రల్లో నటించగా నవదీప్ విల‌న్‌గా ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడు. అలాగే  డి ఇమామ్ సంగీతం అందించారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని భారీగా విడుద‌ల చేయ‌నున్నారు. 

Leave a Reply

Your email address will not be published.