Untitled Post
ఈ మధ్య కాలంలోసెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపుల సెగలు బాగానే తగులుతున్నాయి. కొందరు నోటికొచ్చిన కామెంట్లు పెడుతూ ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తుండం సెలబ్రిటీలకు కాస్త ఇబ్బంది కలిగించేదే… ఏదో ఒకటి రెండు సరదా కోసమంటూ కాసింత పక్కకు పెట్టినా రాయటానికి కూడా అక్షరాలకందనంత దారుణంగా. అసభ్య పదజాలంతో దూషణలతో కొందరు చెలరేగిపోతుండటం కద్దు. ఇలాంటి వేధింపులను ఎవరైనా ఎన్నిరోజులు భరిస్తారు. ఇలాంటిదే పాపులర్ సింగింగ్ సెలబ్రిటీ కౌసల్య విషయంలోనూ జరిగింది.
సామాజిక మీడియా లో ఆమె తనపై గత కొంత కాలంగా జరుగుతున్న వేధింపుల విషయమై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపించే ఆకతాయిలు వందల్లో చేరుతుండటం, ఈ సంఖ్య రాను రాను పెరుగుతుండటంతో ఏకంగా 342 కాంటాక్ట్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టినా ఫలితం లేదు సరికదా వచ్చే మెసేజ్‌లు ఆగకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేనట్టామని, త్వరలోనే సైబర్ క్రైమ్ క్రింద వేధిస్తున్న వారినందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.