తాప్సీకి మరోసారి క్రిటిక్స్ ప్రశంసలు!

పింక్, నామ్ షబానా, మన్మార్జియాన్ వంటి చిత్రాలతో తాప్సీ విజయాలు అందుకుంది. ఆ మూడు సినిమాల్లో మహిళగా బలమైన ముద్ర వేసే పాత్రల్ని ఎంపిక చేసుకుంది ఈ పంజాబీ బ్యూటీ. ఆ క్రమంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా తాప్సీ నటించిన బద్లా మూవీ రిలీజైంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వ ం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ తో కలిసి అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుందని పేరొచ్చింది. ఇటీవలే రిలీజైన ‘బద్లా’ చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్ప ందనలు వచ్చాయి. తాప్సీ ఈ చిత్రంలో నైనా సేథి అనే బిజినెస్ ఉమెన్ పాత్రలో నటించింది. ఓ హత్య నేపథ్య ంలో ఆద్య ంతం ఉత్క ంఠ కలిగించే ట్విస్టులు, టర్నులతో సుజోయ్ ఈ చిత్రాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు వచ్చాయి. ఎవరు ఏమిటి? అన్నది అర్థం కాని ట్విస్టులు వెంటాడతాయట. ఈ చిత్రంలో తాప్సీతో పాటు అమృత సింగ్ ఓ కీలక పాత్రలో నటించారు. స్పానిష్ సినిమా ‘ఇన్విజిబుల్ గెస్ట్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఓపెనింగ్ డే ఉన్న జోష్ ఆ తర్వాత కూడా వసూళ్లలో ఉంటుందా?  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం అందుకుంటుంది? అన్నది కాస్త వేచి చూస్తే కానీ చెప్పలేం.

Leave a Reply

Your email address will not be published.