తెరపై మహేష్ అన్న కొడుకు

సినిమాల్లో వారసుల హవా నిరంతరం చూస్తున్నదే. టాలీవుడ్ లో అఖిల్ ఎంట్రీ తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. వీళ్లతో పాటే.. త్వరలో మరో నట వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. ఈసారి ఘట్టమనేని ఫ్యామిలీ వారసుడు బరిలో దిగుతున్నారు. అతడు తొలుత వెబ్ సిరీస్ తో పాపులరై పెద్ద తెరపైకి ఎంట్రీ ఇస్తారట. వెబ్ సిరీస్ ప్రీ ప్రాక్టికల్స్ కోసమేనని తెలుస్తోంది. ఎఎంబీ సినిమాస్ పేరుతో సినిమా థియేటర్ రంగంలోకి అడుగుపెట్టిన మహేస్ తాజాగా వెబ్ సిరీస్‌ల నిర్మాణంలోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా ‘చార్లీ’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్‌కి శ్రీకారం చుడుతున్న మహేష్ ఈ సినిమాతో తన అన్న రమేష్‌బాబు తనయుడు జయకృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నారు. భారీ ఖర్చుతో అత్యంత సాంకేతికతతో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ డిటెక్టివ్ పంథాలో సాగుతుందట. త్వరలో ప్రారంభం కానున్న ఈ వెబ్ సిరీస్కు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించబోతున్నాడు. వెబ్ సిరీస్ లో సక్సెసైతే, అటుపై పెద్ద తెరపైనా జయకృష్ణ వెలుగులు ప్రసరిస్తారట. ఇక ఈ తరహా ట్రెండ్ బాలీవుడ్ లో ఇప్పటికే ఉంది. అక్కడ స్టార్ హీరోలు, వారి వారసులు  కూడా వెబ్ సిరీస్‌లో నటించడానికి ముందుకొస్తున్నారు. సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి స్టార్స్ ఇప్పటికే వరుస వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్నారు. త్వరలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ ‘మహాభారతం’ను వెబ్ సిరీస్ రూపంలో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందులో అతడి మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ నటిస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.