తనను వేధిస్తున్నాడంటూ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ పై జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపణ

సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులు (కాస్టింగ్ కౌచ్) ఇటీవ‌ల కాలంలో త‌గ్గిన‌ట్టు క‌నిపించినా తాజాగా చాలా వెలుగులోకి వస్తునే ఉన్నాయి. టాలీవుడ్ సినీ నటి శ్రీరెడ్డి   ఈమె ఎదుర్కొన్న అనుభవాలు, అవమానాలు, వేధింపులనురంగ‌రించి చేస్తున్న కామెంట్లు కు హీరోలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకువ‌చ్చింది. త‌న సంపాద‌న‌లో పేద‌ల‌కు అండ‌గా నిల‌చేందుకు కొంత వెచ్చిస్తున్న  సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత, హీరోగా రాణిస్తున్న రాఘవ లారెన్స్‌పై కూడా శ్రీరెడ్డి పబ్లిక్‌గానే ఆరోపణలు చేసింది.  

తాజాగా  దర్శకుడు లారెన్స్ రాఘవ తమ్ముడు వినోద్ (ఎల్విన్) తనను వేధిస్తున్నాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్  శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది.  త‌న‌ని ప్రేమిస్తున్నాన‌ని ఎల్విన్ వెంట తిరిగాడ‌ని, దానిని తిరస్కరించడంతో వేధిస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. గ‌తంలో ఈ విష‌యంపై   హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని… ఇప్పుడు  ఏసీపీగా ఉన్న అధికారి అక్క‌డ  సీఐగా ప‌నిచేస్తూ, లారెన్స్‌కు నమ్మినబంటులా మారి  త‌న ఫిర్యాదును ప‌క్క‌కు నెట్టేసార‌ని, పైగా  తనపై తప్పుడు కేసులు పెట్టారని, సదరు పోలీసు అధికారి అండతో  తనను జైలుకు పంపించారని దివ్య ఆవేదన వ్యక్తంచేసింది. ఇటీవ‌ల జైలు నుంచి విడుద‌లైన త‌న‌ని లారెన్స్‌కు చెందిన కొందరు ఫాలో అవుతున్నారని వాపోయింది .

త‌న‌కు స‌ద‌రు పోలీసు అధికారి నుంచి లారెన్స్ తమ్ముడితో  ప్రాణభయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని తెలంగాణ సిఎంకు విజ్ఞ‌ప్తి చేసారామె.  

 

Leave a Reply

Your email address will not be published.