ఆర్టీసీ బస్సెక్కిన లోకేష్

ఏపిలో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతు తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నారాలోకేష్ తన వినూత్న నిరసన వ్యక్తం చేసారు. బుధవారం ఆయన టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆర్టీసీ బస్సులో మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకు ప్రయాణించి, పెరిగిన చార్జీలపై ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కిలో మీటరుకు 20 పైసలు పెంచామని చెపుతున్న ఆర్టీసీ 15 కిలోమీటర్లకు రూపాయిన్నర పెరగాల్సి ండగా జగన్ సర్కారు 5 రూపాయలు అధికంగా పెంచిందని ప్రయాణికులు లోకేష్ దృష్టి కి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన లోకేష్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, దాని బాధ్యత పూర్తిగా తమదేనని ప్రకటించిన సర్కారు తాజాగా ఆర్ధిక భారం పేరుతో ఏడాదికి 700 కోట్ల నుంచి వెయ్యి కోట్ల దాకా ప్రజలపై భారం పడేలా చేసిందని విమర్శించారు. పెంచిన చార్జీలు తగ్గించే వరకూ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు.
అయితే పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలకు, సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీల పెంపులేదని ఆర్టీసీ స్పష్టం చేసినా అదనంగా రూ.5 పెరగటంపై ప్రయాణీకులు కండక్టర్లని నిలదీసినా ప్రయోజనం లేకపోయింది