ఎనిమిది నెలలకే వైసీపీ ప్రభుత్వ పాలన భ్రష్టుపట్టిపోయింది – టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి….

పాలన చేత ఎనిమిది నెలలకే గాక వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయిందని, దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. శనివారం ఆయన రాజమండ్రిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడూ, ప్రతి విషయంపై గోబెల్స్ ప్రచారం చేయటం అలవాటుగా మారిందని, నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయటం వైసిపి నేతలు చేస్తున్నపని అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిని వేధించేలా కేసులు పెడుతున్నారని, ఇదే మంటే తమని బూతులు తిట్టారని చెపుతున్నారని, మరి వైసీపీ నేతలు, శాసనసభ్యులు సభ సంప్రదాయాలను ఉల్లంఘించి బూతులు మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టరా? తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు ఉండవా? అంటూ విరుచుకుపడ్డారు.
శాసనమండలిలో మైనార్టీ నాయకుడిపై వైసీపీ నేతలు వాడిన భాషను ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారం వైసీపీ ప్రభుత్వం నడవడం లేదని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, మీడియాపై కేసులు బనాయిస్తున్నారని, ఇది ప్రజారాజ్యమా? నియంతల ప్రభుత్వమా? ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు, జగన్! నువ్వెంత? అని వ్యాఖ్యానించారుగోరంట్ల.