ప్రజల కోసమే అవమానాలని భరిస్తున్నా: చంద్రబాబు

ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటిరోజని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ప్రజాపక్షమైన ప్రతిపక్షం టీడీపీని సభలోకి రానివ్వకుండా అడ్డుకున్న బ్లాక్ డే అని మండిపడ్డారు. నిజం చెప్పే మీడియా అన్నా, ప్రభుత్వ తప్పులను నిగ్గదీసే టీడీపీ అన్నా వైసీపీకి భయమని దుయ్యబట్టారు.అందుకే మార్షల్స్ తో బలప్రయోగాలు, మంద బలంతో ప్రతిపక్షం గొంతునొక్కడాలు. పదేపదే నన్ను 40ఏళ్ల అనుభవం అని ఎగతాళి చేయడం, 40నిమిషాలు నన్ను అసెంబ్లీ గేటు బైటే నిలబెట్టడం.. ఇవన్నీ వైసీపీ కావాలని చేస్తున్న కుట్రలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభను నిర్వహించేది ప్రజాసమస్యల పరిష్కారానికా? లేక నన్ను అవమానపరచడానికా? అని ప్రశ్నించారు.ప్రజల కోసమే ఈ అవమానాలనీ, నిందలనీ భరిస్తున్నానని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.పేదల అజెండా వదిలేసి ప్రతిపక్షం అణిచివేేతే అజెండాగా పెట్టుకుంటే వైసిపికి పతనమేనని హెచ్చరించారు. చిత్తశుద్ది ఉంటే జీవో 2430 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ ప్రసారాలకు 3ఛానళ్లపై నిషేధం ఎత్తేయాలని,శాసనసభ గౌరవం నిలబెట్టాలని అన్నారు.