త‌మ్ముడి సాయం అన్న‌కు ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుత‌ది?


నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ కూడా సంక్రాంతి బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. `ఎంత‌మంచివాడ‌వురా` అంటూ పెద్ద హీరోల‌తో పాటు పోటీ ప‌డ‌టానికి రెఢీ అయిపోయారు క‌ళ్యాణ్‌రామ్‌. స‌రిలేరు, అల చిత్రాల విడుద‌ల త‌ర్వాత ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇటీవ‌లె జ‌రిగిన ప్రీరీజ‌ల్ ఈవెంట్‌ల‌లో ఈ చిత్రం కూడా పండ‌గ‌కి హిట్ కావాల‌ని చెప్పేవ‌ర‌కు క‌ళ్యాణ్‌రామ్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న విష‌యం పెద్ద‌గా ఎవ్వ‌రికీ తెలియ‌దు.

అందుకే కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ ను ఒక సహాయం చేయ‌మ‌ని కోరిన‌ట్లు సమాచారం. సినీ వర్గాల నుంచి టాక్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ప్రమోషనల్ టీం తో తన చిత్రానికి విస్తృతంగా ప్రచారం చేయించమని సహాయం కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ ఆ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న విష‌యం తెలిసిందే. దానికి తోడు ఎంతో అనుభవం ఉన్న అతని ప్రమోషనల్ టీమ్ కూడా ఈ చిత్రం పై వర్క్ చేస్తే తన చిత్రానికి మైలేజ్ బాగా వస్తుందని కళ్యాణ్ రామ్ ఆశ. దీనికి తారక్ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.