ఖమ్మం లో రాజ్యసభ వరిస్తుందా? అధినేత ఆశీస్సులు ఏవరికి? పొంగులేటికా? తుమ్మలకా?


రాజ్యసభ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగనునన్నాయి. తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి.ఖాళీ అయ్యేసభ్యులలో కాంగ్రెస్ నుంచి కెవిపి రామచంద్రరావు ,టిడిపి నుంచి ఎన్నికయి బిజెపిలో చేరిన గరికపాటి మోహన్ రావులు ఉన్నారు.తెలంగాణ. నుంచి రెండు సీట్లు ఖాళీ అవుతుండగా ఆంధ్రప్రదేశ్  నుంచి టీఆర్ యస్ కు చెందిన కె.కేశవరావు కూడ ఏప్రిల్ 9 న రిటైర్ కానున్నారు. అయితే కేశవరావుకు మరో  సారి అవకాశం ఇవ్వనున్నారా? లేక సమీకరణాలు  మారతాయా? అనేది చూడాల్సిఉంది.ఖమ్మం నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.వారిలో ఒకరు మాజీ  ఎంపి శ్రీనివాసరెడ్డి కాగా మరొకరు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు .2014 ఎన్నికలలో వైయస్ ఆర్ కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి లోకసభకు పోటి చేసి అనూహ్యంగా విజయం సాధించారు. అనంతర రాజకీయ పరిణామాల నేపధ్యంలో టిఆర్ యస్ చేరారు. టిఆర్ యస్ కండువ కప్పు కున్న సందర్బంగా  తిరిగి 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తాననే హామి ఉన్నప్పటికి ఇవ్వకపోవటంతో అసంతృప్తికి లోనైయ్యారు.ఆయన్ను బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్ హెలీకాప్టర్ ద్వారా కాళేశ్వరం టూర్ తీసుకుని వెళ్లారు.ఖమ్మంలోకసభ సీటు ఇవ్వలేక పోతున్నానని ఖాళీ అయ్యే రాజ్యసభ ఇస్తానని భరోసా ఇచ్చారు. దీంతో రాజ్యసభపై గంపెడు ఆశతో ఆయన ఎదురు చూస్తున్నారు. తనకు పార్లమెంట్ కు పోటిచేసే ఆవకాశం రాకున్నా ఆయన. నిత్యం ప్రజల మధ్యనే ఉంటు తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.ఇక ఇదేజిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటిచేసి ఓటమి చెందారు.తన ఓటమికి పార్టీలో వారే కారణమనే భావనతో రగిలిపోతున్నారు. సుదీర్ఘరాజకీయ అనుభవం కల తుమ్మల తిరిగి పార్టీలో పట్టుకోసం పావులు కదుపుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన తుమ్మల రాజ్యసభకు వెళ్లడం ద్వారా తన కోరిక నేరవేర్చుకోవానే యోచనలో పావులు కదుపుతున్నారు. అయితే రాజ్యసభ ఎవరిని వరిస్తుందో అధినేత ఆశీస్సులు ఎవరికి ఉంటాయోననే ఉత్కంఠ రాజకీయవర్గాలలో ఉంది

Leave a Reply

Your email address will not be published.