విశాఖ సాగ‌ర తీరాన ‘అల..’ సక్సెస్ మీట్సంక్రాంతి కోడిపుంజుగా పోటీలోకి వ‌చ్చిన అల్లు అర్జున్  అల వైకుంఠపురములో ఇప్పుడు స‌క్స‌స్ బాట‌లో ప‌రుగులు తీస్తూ క‌లెక్ష‌న్ల‌లోనూ త‌న స‌త్తా చూపుతూ వ‌స్తోంది.  త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ దర్శకత్వంలో   ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం  సక్సెస్ మీట్ ఆదివారం విశాఖ సాగ‌ర తీరాన జ‌రిగింది.  మెగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చిన ఈ విజయోత్సవ వేడుకలకు అల్లుఅర్జున్  అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ పూజా హెగ్డే పలువురు చిత్ర యూనిట్ యావ‌త్ పాల్గొని ఆదివారం సాయంత్ర‌వేళ విశాఖ జ‌నాల‌ని బాగా ఎంట‌ర్‌టైన్ చేసారు.  

ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. త‌న‌కు న‌చ్చి రావిశాస్త్రి, శ్రీశ్రీ, చలం లాంటి రచయితల ప్రస్థానం  విశాఖ‌నుంచి ఆరంభమైంద‌ని,  అలాగే త‌న‌కు  వైజాగ్‌తో మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఈ చిత్ర క‌థ రాసుకుంటున్న‌ప్పుడే ఈ పాత్ర‌కు అల్లు అర్జున్ త‌గిన వాడ‌ని ఊహించుకుంటూ రాసుకున్నాన‌ని,  అందుకు త‌గిన‌ట్టే అల్లు అర్జున్  తో స‌హా సినిమా విజయంలో ప్రతి ఒక్కరు కీల‌క భూమిక పోషించార‌ని హ‌ర్ష‌ధ్వానాల న‌డుమ చెప్పారు.  

అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ..  గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఇండస్ట్రీకి ఆల్ టైమ్ హిట్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపారు. అభిమానులు అందరికి ఉంటారు..కానీ నాకు మాత్రం ఒక ఆర్మీ ఉంది. అందుకు తను గ‌ర్విస్తాన‌ని చెప్పారు.   విశాఖ తనకు ప్రత్యేకమని  విశాఖ తనకు కంచుకోటలాంటిదని రికార్డులు శాశ్వతం కాదని, తాత్కాలికం మాత్రమేనని కానీ అభిమానాన్ని త‌ను వెల‌క‌ట్ట‌లేన‌ని చెప్పారు.  

Leave a Reply

Your email address will not be published.