జ‌ర్సీలో యంగ్ బ్యూటీసాంగ్‌

‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో.. నాని ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందుతుంది. కాగా, ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆదా శర్మ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఆదా శర్మ నితిన్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

జెర్సీ చిత్రం ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో.. ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతుంది. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుందని.. సీన్స్ అనుకున్నదాని కంటే బాగా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నిర్మాత సూర్య దేవర నాగ వంశి నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.