రేవంత్‌కి ఎదురుదెబ్బ తగిలిన‌ట్టే


డ్రోన్‌ కెమేరా కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను   కూకట్‌పల్లి కోర్టు  కొట్టివేసింది.ఈ మేర‌కు రేవంత్ రెడ్డి దాఖ‌లు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై  మంగళవారం న్యాయ‌మూర్తుల ముందు అటు ప్ర‌భుత్వం త‌ర‌పున ఇటు రేవంత్ త‌ర‌పున‌ ఇరు పక్షాల వాదనలు  హోరా హోరీగా వినిపించారు. వీటిని ఓపిక‌గా విన్న న్యాయమూర్తి త‌న తీర్పు రిజర్వు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి  బుధ‌వారానికి కేసు వాయిదా వేసారు. 

ఈ నేప‌థ్యంలో కోర్టు త‌న తీర్పును ప్ర‌క‌టిస్తూ,  మల్కాజిగిరి ఎంపీ గా ఉన్న‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తారంటూ ప్ర‌భుత్వ వాద‌న‌ల‌తో ఏకీభ‌విస్తూ, కేసు కొట్టేసింది. దీంతో రేవంత్‌కి ఇది పెద్ద‌ ఎదురుదెబ్బ తగిలిన‌ట్టే భావిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.  

మంత్రి  కేసిఆర్‌ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ వాడ‌టంతో పాటు అనేక అంశాల‌ను చిత్రీక‌రించిన విష‌యంపై అందిన ఫిర్యాదుతో ఎంపి రేవంత్‌ అరెస్ట‌యిన విష‌యం విదిత‌మే.  ప్రస్తుతం ఆయ‌న‌ చర్లపల్లి జైలులో ఉంటు త‌న‌కు బెయిల్ ఇవ్వ‌మ‌ని కోరుతూ దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌ కొట్టివేత నేపథ్యంలో మరోసారి పిటిషన్‌ దాఖలు చేయడానికి రేవంత్‌ లాయర్లు ప్రయత్నిస్తున్నారని స‌మాచారం. 

Leave a Reply

Your email address will not be published.