ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్ర‌హంరాజ‌ధానిలో ఉద్య‌మం చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. నోటికొచ్చిన‌ట్టు రైతులపై ఇష్టాను సారంగా మాట్లాడటం వ‌ల్ల జ‌నంలో ప‌లుచన‌వు తున్నామ‌ని, పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవా ల‌ని యోచిన‌ట్టు తెలియ‌వ‌చ్చింది. పృథ్వీ చేసిన వ్యాఖ్యలను సినీ ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్‌ నటుడు, ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఖండించి వారికి బేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేసిన నేప‌థ్యంలో ఈ రైతు ఉద్యమం  కార్పొరేట్ ముసుగులో జ‌రుగుతున్న దని, క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని  పృథ్వీ వ్యాఖ్యానించారు.

రైతులంటే మోకాలి లోతు బురదలో ఉంటార‌ని.. కాళ్లు కడుక్కుని ఏదో తిని ఉండేవాళ్లే కానీ ఇలా ఖద్దరు బట్టలు, ఆడీ కార్లు, నాలుగైదు గొలుసులు వేసుకుని తిరిగేవారు కాద‌ని  వాళ్లంతా త‌న‌తో న‌టించిన‌ పెయిడ్ ఆర్టిస్టులని, న‌టుడుగా వారంతా త‌న‌కు తెలిసిన వారే నంటూ మ‌రోమారు రెచ్చిపోయిన పృధ్వీ ఇప్పటికీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చిన త‌రుణంలో వైసీపి అధిష్టానం ఈ విష‌యంపై దృష్టి సారించ‌డం గ‌మ‌నార్హం. చ‌ర్య‌లు తీసుకునే ఆస్కారం లేక పోలేద‌ని వైసిపి వ‌ర్గాలు చెపుతున్నాయి… ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి మ‌రి. 

Leave a Reply

Your email address will not be published.