రాంగ్ రూట్ లో రాపాక ‘జనసేన కు షాక్ ఇవ్వబోతున్నారా’ ?
 జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ అధినేత మూడు రాజధానులను వ్యతిరేకిస్తుంటే.. ఎమ్మెల్యే మాత్రం సై అంటున్నారు. అసెంబ్లీలో మూడు రాజధానుల ఏర్పాటుకు బిల్లు పెడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని రాపాక వెల్లడించారు. 
 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్‌ జరిగితే దానికి మద్దతుగానే తాను ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. 

ఇదిలా ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది. రాజధానిని తరలింపును నిరసిస్తూ బీజేపీతో కలిసి పోరాడాలని ఇటీవల పవన్ పొత్తు కూడా పెట్టుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం పవన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇటీవల సంక్రాంతి వేడుకల్లో మంత్రి కొడాలి నానితో కలిసి రాపాక ఎడ్ల పోటీలను కూడా ప్రారంభించారు. అలాగే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రాపాక ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published.