ఏపీ టీడీపీ నేతలకు మంత్రి అనిల్ స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.   గత కొద్ది రోజుల నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో రాజధానుల అంశం పార్టీల మధ్య మాటలయుద్ధానికి దారితీస్తోంది. రైతులు చేపట్టిన రాస్తారోకోలో మరో వివాదానికి తెరలేపింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆందోళన చేస్తున్న రైతులు దాడికి దిగారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ దీనిపై స్పందించారు.

  పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై జరిగిన దాడిని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. టీడీపీ అగ్రనేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతుల ముసుగులో టీడీపీ శ్రేణులు దాడులు చేయడమేంటని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. తాము కూడా ఎదురు దాడులకు దిగితే.. పరిస్థితి ఎలా ఉంటుందో  ఊహించుకోవాలని గట్టిగానే చెప్పారు. మేము ఎదురుదాడికి దిగితే.. టీడీపీ అధినేతతోపాటు ఎవరూ కూడా బయట తిరగలేరని హెచ్చరించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని. రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published.