ఇంటర్వ్యూ : సంగీత దర్శకుడు శేఖర్ చంద్రతో
‘నచ్చావులే’ ‘మనసారా’.’నువ్విలా’, ‘కార్తికేయ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’,’118‘ ఇలా ఎన్నో మ్యూజికల్ హిట్స్ సినిమాలు ఇచ్చిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర ఇటీవలె వచ్చిన ‘సవారి’ చిత్రంలో ‘నీ కన్నులు’ ‘ఉండిపోవా’ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచి కేవలం మెలోడీ సాంగ్స్ మాత్రమే కాదు మాస్ మ్యూజిక్ కూడా అందించగలనని నిరూపించాడు . తాజాగా ఫిబ్రవరి 21 న ఆతని సంగీత దర్శకత్వం వహించిన ‘వలయం’ సినిమా విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుండి ‘నిన్ను చూసాకే’ అనే పాట సోషల్‌మీడియాలో ప్రత్యేక ప్రశంసలందుకుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న శేఖర్ చంద్ర మీడియాతో జరిపిన చిట్‌చాట్ ఇలా సాగింది.
ఈ మథ్య కాలంలో మీ పాటలెక్కువగా జనం మధ్య వినిపిస్తున్నాయి కదా ఎలా ఉంది?
మన గురించి ఆడియన్స్ మాట్లాడుకునేటప్పుడు. హ్యాపీగా ఎందుకుండదు. నేనూ అలానే ఫీలవుతున్నా,. నా తొలి సినిమా ‘నచ్చావులే’ నుంచి ఇప్పటి వరకు ఆదరిస్తూ వస్తున్న జనం ఇటీవల విడుదలైన ‘సవారి’ పాటల్ని పెద్ద హిట్ చేసారు. అందులో ‘నీ కన్నులు’ పాటకి 10 మిలియన్ వ్యూస్ అందుకుందటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సాంగ్ తో సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు కొన్ని లక్షల వీడియో అప్డేట్ అవుతున్నాయి. జనం మెచ్చేలా పాట రాసిన కాసర్ల శ్యామ్, ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ లకి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి.
మీరు పరిశ్రమకి వచ్చిన నాటి నుంచి ఎన్ని సినిమాలు చేసారు.?
నా తొలిసినిమా విడుదలై 14 ఏళ్లు అవుతోంది. 35 సినిమాల వరకూ చేశాను. విడుదల కావాల్సిన వాటితో కలిపి.
మీ కెరీర్ ఎలా ఉంది?
ఇప్పటికైతే ఓకే. చాలా ప్రశాంతంగా ప్రేక్షకులకు వీనుల విందు చేస్తూ సాగుతోంది. నా పాటలన్నింటికీ మంచి రెస్పాన్స్ రావటం ఆనందమేస్తోంది.
పరిశ్రమకొచ్చి 14 ఏళ్లవుతోంది కదా? మరి మీకు మంచి జ్ఞాపకంగా నిలచి పోయే అంశం ఏంటి?
నేను చేసిన చిత్రాలలో అతి పెద్ద సినిమా ‘118’ గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన సినిమా అది. సినిమా అంతా ఓ ఎత్తయితే … అందులో కేవలం ఒకే ఒక్క పాట రి స్పేస్ ఉండటం, పైగా అది థ్రిల్లర్ మువీ కాంటంతో ఆ ఒక్క పాటకి న్యాయం చేయగలనా అని భయం వేసింది, అయితే కళ్యాణ్ రామ్ ప్రోత్సాహంతో ‘చందమామే’ పాట చేసా. సినిమాలోనూ బాగా వచ్చింది. చాలా పెద్ద హిట్ అయ్యింది. నా కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాట అని కళ్యాణ్‌రామ్ చెపుతుంటే నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇంతకన్నా తీపి జ్ఞాపకం ఇంకేముంటుంది.
ఇంతవరకు చిన్న చిత్రాలు చేసిన మీరు పెద్ద హీరోల వైపు మరలినట్టున్నారే? ని ఎలా ఫీలవుతున్నారు?
నేను చేసేవి చిన్న సినిమాలే అయినా కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు. ఎప్పటికప్పుడు తాజాగా ఆలోచించి మ్యూజిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మంచి అప్లోజ్ వస్తుంది. పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు. అయితే పెద్దహీరోలతో పని చేస్తే, త్వరిత గతిన మనం పాపులర్ అవుతాం. సంగీతానికి చిన్న, పెద్ద అని తేడాలుండవ్ కదా?
థ్రిల్లర్ సినిమాలు.. లవ్ స్టొరీలు చేస్తున్నారు కదా? మీకు ఏది ప్లస్ అవుతుందని భావిస్తారు?
చెప్పానుగా ఏసినిమా అయినా మంచి సంగీతం అందించడమే నా పని ఇక లవ్ స్టొరీస్ చేస్తే మంచి మెలోడీ పాటలు చేసే ఆస్కారం ఉంటుంది. అయితే థ్రిల్లర్స్ లో ఈ తరహా స్కోప్ కొంత తక్కువే అయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల మంచి పేరొచ్చే అవకాశం ఉంటుంది.
సోషల్ మీడియా కు మీరు దూరంగా ఉంటున్నారెందుకో… ?
ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదు. నాకున్న సమయమంతా మ్యూజిక్కోసమే వినియోగిస్తున్నా. అందువల్లే ఇప్పటి వరకూ సోషల్ మీడియా గురించి ఆలోచించ లేదు.. ఈమధ్య రాహుల్ సిప్లిగంజ్ తన అకౌంట్ చూపించి నువ్వూ ఖాతా ఆరంభించని సూచించాడు చూస్తా, సమయానుకూలంగా వాటి గురించి ఆలోచిస్తా.
మీ పాటలలో మీకు బాగా నచ్చిన పాటలు ఏంటట?
‘సవారి’ మూవీ లో ‘నీ కన్నులు’ ‘ఉండిపోవా’ , ‘118’ మూవీలో ‘చందమామే’, ‘కార్తికేయ’ లో ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’, ‘మేం వయసుకు వచ్చాం’ మూవీలో ‘వెళ్ళిపోకే’ . నాకు చాలా నచ్చిన పాటలు. ఇంకొన్ని చేయాలనే స్పూర్తిని ఇచ్చే పాటలు ఇవి.
ఇతర భాషా చిత్రాలు చేస్తున్నారా?
ప్రస్తుతానికి అయితే లేదండీ. ఇక్కడే నేను సాధించాల్సింది చాలా ఉందనిపిస్తోంది. ఇక్కడ ఇంకా నిలదొక్కుకోవాల్సి ఉంది. ఇతర భాషా చిత్రాలు తరువాత చూద్దాం.
అన్నట్టు మీ ఫాదర్ గ్రేట్ సినిమాటోగ్రఫర్ కదా మీరేంటి అటువైపు కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు?
అవును , నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు. నాన్న షాకయ్యారు.. ఎందుకంటే సినిమాటోగ్రఫీ లో ఎంతో మంది సహాయం ఉంటుంది. కనుక పర్వాలేదు.. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా రిస్క్ కదా అని చెప్పారు. అయినా ప్రయత్నించు. కాదంటే ఇటు వద్దువుగానీ అని నన్ను చాలా ప్రోత్సహించింది ఆయనే. నేను చేసిన కొన్ని సినిమాలు ఆయన మెచ్చుకున్నారు. వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆయనకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చిందనిపిస్తోంది.
మీతదుపరి సినిమా ఏంటి?
‘వలయం’ తరువాత ఇక ‘హుషారు’ టీం తో ఓ సినిమా ఉంది. మరో సినిమా కథా చర్చలు జరుగుతున్నాయి ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.