వేసవికి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా విడుదల

సంచలన దర్శకుడు, ఓటమంటూ ఎరుగని దర్శక ధీరుడు, పలు రికార్డులను సైతం తన సినిమాలతో కైవసం చేసుకున్న సక్సెస్‌ఫుల్ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామచరన్‌లతో కలిపి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.  ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. వచ్చే వేసవికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ఏ హీరోతో రాజమౌళి సినిమా ఉండనుంది? అనే ప్రశ్నకి సమాధానంగా ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

‘బాహుబలి’ .. ‘బాహుబలి 2’ సినిమాల షూటింగు నిమిత్తం సుదీర్ఘ కాలం పాటు కలిసి ప్రయాణం చేయడంతో, ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో రాజమౌళితో సినిమా చేయడానికి ప్రభాస్ ఆసక్తిని చూపడంతో, అందుకు రాజమౌళి కూడా ఒకే అన్నట్లు  వార్తలు వైరల్ అవుతున్నాయి.  వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందనీ, 2022లో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంటున్నారు. ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.