గోడ మీద వార్తలు

01 . హైదరాబాద్ డాక్టర్ దిశ అత్యాచార కేసులో నిందితులందరిని ఈ రోజు తెల్లవారక ముందే ఎన్కౌంటర్లొ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పార…బ్బిన – పోలీసులు …
శబ్భాష్ …. మానవ హక్కులు మట్టిగడ్డలంటూ చూడకుండా మిగిలిన ఎదవలని కూడా ఇట్టాగే కాల్చిపార..బ్బండి బాబాయ్ – దేశానికి పట్టిన శనొదిలిపోద్ది …!! 
02. అనంతపురంలో కియా మోటార్స్ కార్ల కంపెనీని ఘనంగా ఓపెనింగు చేసిన – జగన్ …
మాంగళ్యానికి మరో ముడనీ – ఇది కూడా ముహూర్తం టైముకి తాళి కట్టేసాక కెమెరామెన్ ఈగో సాటిస్ఫై చేయటం కోసం మరోమారు ఒంగుని  చేతులూపటం లాంటిదే – …!!
03. మద్యం అమ్మకాల్లో కొత్త అధ్యాయానికి తెర లేపిన ఏపీ సర్కార్ –  లిక్కర్ని ప్రీపెయిడ్ రీచార్జ్ కార్డుల ద్వారా అమ్మాలని నిర్ణయం …
వడ్డీ లేకుండా ముందే బాదేటం ఎలా..?? అనే టైటిల్ తో ఓ పుస్తకం వ్రాయోచ్చేమో ఈ కాన్సెప్టు మీద …!!
04. వృద్ధులైన తలితండ్రులని చూడని పిల్లలపై చట్టపరమైన చర్యలు తీస్కునే విధంగా గట్టి చట్టాన్ని చేసే ఆలోచనలో కేంద్రం …
మంచిది – ఆ చేత్తోనే ప్రజల్ని పట్టించుకోకుండా గాలికొదిలేసిన పాలకులపై కూడా ఏదన్నా చర్యలు తీస్కుంటే సంతోషిస్తాం …!!
05.  పవన్ కళ్యాణ్ ఊఁ …. అంటే చాలు రాప్తాడు ఎమ్మెల్యేదే కాదు – ఎవరి తలైనా నరికితెస్తా – ఓ వీరావేశ భక్తుడు …
రేయ్ – ఆళ్ళ తలకాయలేమమన్నా పేను కొరుకుడు చిన్నారావ్ గాడింట్లో  స్విచ్చుల నుకున్నారేట్రా – ఊఁ …అనగానే ఏసేటానికి…!!

Leave a Reply

Your email address will not be published.