వర్ణభరితమైన ప్రేమకథా చిత్ర కావ్యం సంగమ్

గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. ఐతే వీటిలో గంగా, యమునలే సాధారణ నయనాలకు దర్శనమిచ్చేవి. సరస్వతి అంతర్వాహిని యై వీటితో కలుస్తుంది. ఈ యధార్థాన్ని రాజ్‌కపూర్ తన చిత్రం సంగమ్ ద్వారా నిరూపించారు. ప్రేమకథను త్రికోణంలో మూడు పాత్రల ద్వారా నిరూపించారు. ప్రేమకథను త్రికోణంలో మూడు పాత్రల ద్వారా చాలా సినిమాలలో చూపించారు. కానీ రాజ్‌కపూర్ చూపించిన విధానం, పతాక సన్నివేశం, అంతిమ తీర్పు, ఆ తర్వాత చిత్రాలకు మార్గదర్శకమైంది. అంతేకాదు రాజ్‌కపూర్ ఈ చిత్రం ద్వారా సినిమా నిర్మాణంలో కొత్తబాటలకు పునాది వేశారు. ఫాన్స్, స్విట్జర్లాండ్ మొదలైన యూరప్ దేశాలలో సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోవడం ఒక విధంగా భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబె్టడమే. మరొక సంగతి అప్పుడెప్పుడో ఇండియన్ సినిమా తొలి దశలో హియాంశురాయ్, దేవికారాణి ముద్దు సన్నివేశంలో నటించినట్లు సంగమ్ చిత్రంలో పారిస్‌లో ఈఫిల్ టవర్‌మీద రాజ్‌కపూర్, వైజయంతిమాలను ముద్దుపెట్టుకోబోతుండగా, ఒక ఫ్రెంచ్ జంట ఆర్యూ ఇండియన్స్ అని అడిగితే దగ్గరైన హీరో హీరోయిన్లు దూరంగా జరగడం వంటి సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించడం కూడా రాజ్‌కపూర్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. మన భారతీయ సంస్కృతికి కొన్ని హద్దులుంటాయిన ఆ సన్నివేశం నిరూపించింది.
రాజ్‌కపూర్ తన ఆర్.కె. బ్యానర్ మీద సంగమ్ చిత్రానికి ముందు తీసిన చిత్రాలన్నీ బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే. ఆయన తన తొలి ప్రయత్నంగా సంగమ్ని వర్ణ రంజితంగా తీశారు. ఆ ప్రయత్నం వమ్ముకాలేదు. అఖండమైన ఖ్యాతిని, డబ్బును సంపాదించి పెట్టింది. సాధారణ ప్రేమకథకు రంగుటద్దాల వెలులుఉ నింపిసర్వజనరంజితంగా తీర్చిదిద్దిన సంగమ్ సినిమా కొన్ని తరాల వరకు గుర్తుండిపోయే సినిమా అయింది.
సుందర్, గోపాల్,రాధ ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు విడిచి వుండలేనంతగా పెరిగారు. సుందర్ సాధారణ మధ్య తరగతికి చెందిన వాడు కాగా రాధ, గోపాల్ ధనవంతుల బిబ్బలు. ప్రాణాతిప్రాణంగా ప్రేమించిన రాధను వివాహం చేసుకోవడానికి, ఆ తీరానికి ఈ తీరానికి మధ్య నది ప్రవాహమై నిలిచింది. రాధను తన దానిగా చేసుకోవడానికి తాను ధనవంతుడ్ని అవాలనే తలంపుతో సుందర్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాడు. ఆర్ధికంగా బలపడిన తర్వాత రాధను పెండ్లి చేసుకుని ఆమెత హనీమూన్‌కి యూరప్ వెళతాడు. తిరిగి వచ్చిన తర్వాత సుందర్ ఉద్యోగ నిర్వాహణకై దూరంగా వెళతాడు. వెళ్ళిన కొంతకాలంలోనే సుందర్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు కబురు తెలుస్తుంది. సుందర్ మరణించాడని తెలియడంతో మళ్ళీ గోపాల్ రాధల మధ్య స్నేహం చిగురించి మొగ్గలు తొడిగి పూలై విరబూస్తాయి. అదే సమయంలో సుందర్ సజీవంగా ఫ్లైట్‌లో దిగుతాడు. గోపాల్ వికసిస్తుందనుకున్న ప్రేమవికటిస్తుంది. ఒక నా ఈవితంలో నీకు స్థానం లేదని రాధ నిర్మోహమాటంగా గోపాల్‌తో చెబుతుంది. ఒకరోజు హాఠార్తుగా సుందర్‌కి ఒక లేఖ కంటబడుతుంది. అది ఎప్పుడో గోపాల్ రాధకు రాసిన ప్రేమలేఖ. సుందర్ ఆ ఉత్తరం గురించి రాధను అడుగుతాడు. అది తన జీవితంలో గతమని ఇప్పుడు ఆ గతాన్ని పూర్తిగా తుడిచేసేనని చెబుతుంది రాధ. ఆ లేకను ముక్కలుగా చిపంపారేస్తుంది. ఆ ఉత్తరం ముక్కలను సుందర్ ఏరుకోవడం గోపాల్ గమనిస్తాడు. రాధ సుందర్‌ల సంసారం సజావుగా సాగాలంటే తాను వారి జీవితాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని గోపాల్ ఆత్మహత్య చేసుకుంటాడు. మరణించినా వాదిద్దరి హృదయాలలో శాశ్వతంగా గోపాల్ నిలిచిపోతాడు.
ఈ కథను సర్వాంగ సుందరంగా అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దడంలో రాజ్‌కపూర్ పడిన శ్రమ, ఖర్చుపెట్టిన డబ్బు వృదా కాలేదు. ఈ సినమాలో సుందర్‌గా రాజ్‌కపూర్, రాధగా వైజయంతి మాల, గోపాల్‌గా రాజేంద్రకుమార్ ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా నటించారు. ఐతే రాజ్కపూర్కిఎక్కువ మార్కులు పడతాయి. ఈ చిత్రానికి శంకర్ జైకిషన్ సమకూర్చిన సంగీతం శావ్వతత్వం సంపాదించింది. ఆ పాటలు ఈనాడు ఇన్నా శ్రోతలు మధుర భావలహరిల తేలియాడకమానరు. సంగీతంతో సాహిత్యం కూడా పోటీ పడింది. మేరామన్కి గంగా తేరేమన్కి జమునా బోల్ రాధాబోల్ సంగమ్ హోగాకీ నహీ పాటలకు సమకూడిన బాణీ పరవళ్ళు త్రొక్కి వెండితెర పై చిందులేసంది. యేమేరా ప్రేమ్ పత్ర పడకర్ కెతుమైరాజ్ నహోగా పాట వింటుంటే సపందైన సనసతొక్కతిన్న అనుభూతి కలుగుతుంది. హర్దిల్జోప్యార్ కరేగా వోగానా గాయేగా పాట గానామృతం చెరకు తీపి చిలికించినట్లు అనిపిస్తుంది. దోస్త్ దోస్త్ నారహాప్యార్ ప్యార్ నారహా హృదయ కవాటంతెరచుకుని విషాద విరహం వెదజల్లినట్లనిపిస్తుంది. శైలేంద్ర, హ్రస్తత్ జైపురి, కవిత్వ రసఝరి ప్రేక్షకుల మనోఫలకాల పై ఎప్పటికీ మరపురాని మధురగీతాలై శోభించాయి. ఇష్రామ్మ ఝు బుడ్డామిల్ గయా రాధ సుందర్‌ని హేళన చేస్తూ పాడే పాట మనస్సులను ఆనందడోలికలల్లో ఊగిస్తాయి.
సంగమ్ చిత్రం మనదేశంలోనే కాకుండా యూరప్ దేశాలలతోనూ ఇజ్రాయిల్, ఈజిప్టు దేశాలలనూ విజయవంతంగా భేరిమ్రోగించింది. రాజ్‌కపూర్‌కి విశేషంగా విదేశీమారక ద్రవ్యం సమకూర్చి పెట్టిం.