అంచనాలను పెంచుతున్న పూరీ, దేవరకొండ కాంబినేషన్


సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో భారీ అంచనాలు  న్నాయి.   పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయ్ దేవరకొండ లుక్ ఉండేలా చూస్తున్నారంటూ విజ‌య్‌దేవ‌ర‌కొండ ఆమ‌ధ్య మీడియాకు చెప్ప‌డంతో అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. 
బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల హీరోయిన్ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ముంబైలో ఆర్ట్ డైరెక్టర్ జాని షైక్ బాషా నిర్మించిన భారీ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండ‌గా గురువారం నుంచి   ఈ చిత్ర షూటింగ్ లో హీరోయిన్ అనన్య పాండే జాయిన్ అయ్యింది.  ఈ సంద‌ర్భంగా అన‌న్య‌కు వెల్‌కం చెపుతూ ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను చిత్ర యూనిట్ మీడియాకు విడుద‌ల చేసింది. 

Leave a Reply

Your email address will not be published.