మొదటిసారి హీరోగా వెండితెర పై మేపించనున్న ప్రదీప్ మాచిరాజు…

తన యాంకరింగ్,‌నటనతో ప్రేక్షకులను మైమరిపించిన నటుడు ప్రదీప్ మాచిరాజు. ఆయన కామెడీ టైమింగ్, తనదైన చలోక్తులతో షోలను రక్తి కట్టిస్తాడు. ఒక్కోసారి వివదస్పందగానూ మాట్లాడతుంటాడు ప్రదీప్. తను కొన్ని చిత్రాల్లోనూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గానూ మెప్పించారు. తను ఇంతవరకు హీరోగా నటించలేదు. అయితే మొదటి సారిగా  ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా తెరపై సందడి చేయనున్నాడు. 

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయనే ఈ సినిమాకు రచయిత కూడా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను శనివారం రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ల కాన్సెప్టు, మ్యూజిక్ తనకు బాగా నచ్చాయని రానా చెప్పాడు.

ఫస్ట్ లుక్ పోస్టరులో పల్లెటూరి వేషంలో ఉన్న ప్రదీప్, కథానాయికగా అమృత అయ్యర్ నటించనుంది.ఫస్ట్ లుక్ పోస్టర్  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుది. పోస్టర్‌లో సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్ ను తలపిస్తోంది. టైటిల్ డిజైన్ కూడా ఆసక్తికరంగా ఉంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్ ను రూపకల్పన చేశారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని యూనిట్ ప్రకటించనున్నది.  ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published.