రిజిస్ట‌ర్‌లో రాసిన ట్రంప్ వాక్యాలు వివాదాల‌కు తెర‌లేపేలా ఉన్నాయి.

సబర్మతి ఆశ్రమాన్ని సంద‌ర్శించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌  ట్రంప్ ఆశ్ర‌మ సంద‌ర్శ‌కుల రిజిస్ట‌ర్‌లో రాసిన వాక్యాలు వివాదాల‌కు తెర‌లేపేలా ఉన్నాయి. 
సోమ‌వారం ట్రంప్ దంప‌తులు గాంధీజీ స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని సందర్శించి  అక్క‌డ అన్నింటిని గ‌మ‌నించారు. అనేక అంశాల‌ను అడిగి మ‌రీ తెలుసుకున్నారు. గాంధీజీ పోరాటం ప్ర‌పంచాన్ని ఆద‌ర్శంగా నిలిపేలా చూసే స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మంలోకి వ‌చ్చే సంద‌ర్శ‌కులు, అతిథులంతా గాంధీజీ గురించి లేదా తమ జీవితాల్లో గాంధీజీ ప్రభావం గురించి ఇక్క‌డి రిజిస్ట‌ర్‌లో  రాయడం పరిపాటి. అయితే  ట్రంప్ మాత్రం ‘‘టు మై గ్రేట్ ఫ్రెండ్ పీఎం మోదీ.. ఇంత గొప్ప సందర్శన ఏర్పాటుచేసినందుకు థ్యాంక్స్”అని ట్రంప్ సంతకం చేశారు. దానికిందే మెలానియా ట్రంప్ కూడా సంతకం చేశారు. 
అయితే ట్రంప్ రాసిన వాక్యాల‌లో క‌నీసం గాంధీజీ పేరును ప్రస్తావించక పోవ‌టం ఒక‌టైతే… ఎక్క‌డా ఈ సంద‌ర్శ‌కుల రిజిస్ట‌ర్‌లో ఇత‌ర వ్య‌క్తుల ప్ర‌స్తావ‌న‌లుండ‌కున్నా ట్రంప్ మాత్రం కేవలం మోదీ గురించి రావయటం మ‌రోవైపు వివాద‌మ‌వుతోంది.   ప్ర‌ధాని మోడీ ఆశ్ర‌మంలో అన్ని ర‌కాలుగా ద‌గ్గ‌రుండి మ‌రీ అన్నీ చూపించారు. చెప్పారు. ఈ విష‌యం మాత్రం ఎందుకులే అనుకున్నారా? అన్న నిల‌దీత‌లు ఆరంభించేసాయి విప‌క్షాలు. మ‌రి ప్ర‌ధాని ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.