బాలీవుడ్ ఫిల్మ్ ‘అంధాధున్’కు రీమేక్ గా స్క్రిప్ట్

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై  ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది.  బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాధున్’కు  రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా న‌టిస్తుండ‌గా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు.  ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రారంభ వేడుకలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ ను సినిమా యూనిట్ కు అందజేసి ఆశీర్వ‌దించారు. 

అలాగే ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సన్నివేశానికి సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.  జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామ‌ని ఈ సంద‌ర్భంగా ఠాగూర్ మ‌ధు మీడియాకు చెప్పారు. త్వ‌ర‌లోనే సాంకేతిక నిపుణులు, న‌టీన‌టుల ఎంపిక పూర్తి చేస్తామ‌ని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published.