ఈసారి ‘ఫీల్‌ గుడ్‌’ బడ్జెట్టే

దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం 2020–21లో 6–6.5 శాతానికి పుంజుకోవచ్చని 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. అయితే,.. ఎనిమిది నెలల క్రితం లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి! నరేంద్ర మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ ఇది! మరి, ఈ బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది!? వరాల బడ్జెట్‌ ఉంటుందా!? వాతల బడ్జెట్‌ ఉంటుందా!? అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ఉత్కంఠ ఇది! మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. కానీ, ఈసారి ‘ఫీల్‌ గుడ్‌’ బడ్జెట్టే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఒక కారణం.. ఆర్థిక మాంద్యం కాగా.. మరొక కారణం ఢిల్లీ ఎన్నికలని విశ్లేషిస్తున్నారు. 

ఆర్థిక మందగమనం తారస్థాయికి చేరిన నేపథ్యంలో కన్య్జూమర్‌ డిమాండ్‌, ఇన్వె్‌స్టమెంట్‌ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్ని చర్యలూ తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020–21 ఆర్థిక బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌చు సమర్పించనున్న విషయం తెలిసిందే. దీనికి ఒక రోజు ముందు శుక్రవారం ఆర్థిక సర్వే నివేదికను ఆమె పార్లమెంటు ముందుంచారు.

Leave a Reply

Your email address will not be published.