కొర‌టాల చిరు పెట్టిన డెడ్‌లైన్‌కి క‌ట్టుబ‌డి ఉంటాడా?కొంత‌మంది హీరోలు ఎవ‌రైన ద‌ర్శ‌కులు లేదా నిర్మాత‌ల‌కి ఏమ‌న్నా కాస్త విష‌యాన్ని సీరియ‌స్‌గా చెప్పాలంటే కొన్ని కొన్నిసార్లు మీడియాని వాడేస్తుంటారు. అందులో ముందు వ‌రుస‌లో  కింగ్‌నాగార్జున ఉంటారు. ఏదైనా స‌ర‌దా స‌ర‌దాగా న‌వ్వుతూనే అవ‌త‌లి మ‌నిషికి అర్ధ‌మ‌య్యేలా సెటైర్‌లు వేసేస్తుంటారు. అదే విధంగా మొన్న చిరంజీవి కూడా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కి చిరు గెస్ట్‌గా వెళ్ళిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ఆయ‌న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు న‌వ్వుతూనే చిన్న వార్నింగ్ ఇచ్చారు.

అస‌లు విష‌యం ఏమిటంటే…చిరంజీవి సైరా చిత్రం త‌ర్వాత కొర‌టాల‌శివ‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈవెంట్‌కి  కొర‌టాల కూడా రావ‌డంతో వేదిక మీద ఉన్న కొర‌టాల‌కు ఆయ‌న  అతి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తిచేయడం అత్యవసరం అన్నారు మెగాస్టార్. తక్కువ రోజుల్లో సినిమా పూర్తయితే నిర్మాతకు ఎక్కువ లాభం ఉంటుందన్నారు. ఇలా ఫ్లోలో మాట్లాడుతూనే.. తన సినిమాను కూడా 100 రోజుల్లోపే పూర్తి చేస్తానని కొరటాల మాటిచ్చాడంటూ మీడియా స‌మ‌క్షంలో కొర‌టాల‌ను ఇరికించాడు.

దీంతో కొర‌టాల ఒకేసారి ఖంగుతిన్నాడు. అంత‌మంది ఉన్న వేదిక మీద త‌లూప‌డం త‌ప్ప వేరే ఏమీ చేయ‌లేక స‌రేనంటూ మాటిచ్చాడు.  80 నుంచి 99 రోజుల్లో సినిమాను పూర్తిచేయాలనేది చిరంజీవి డెడ్ లైన్. అంటే.. ఆఖరి తేదీ మార్చి 30. ఇక మ‌రి కొర‌టాల ఏం చేస్తాడో చూడాలి మ‌రి. ఇక ఇదిలా ఉంటే రాంచ‌ర‌ణ్ ప్రొడ్యూస‌ర్ అయ్యాక ఆ బ‌రువు బాధ్య‌త‌లు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగా కనిపెట్టిన వీరు ఒక నిర్మాత ప‌డే ఇబ్బంది ఏంటి అన్న‌ది తండ్రి కొడుకులిద్ద‌రికి బాగా తెలిసిన‌ట్టుంది. దీంతో వీరిద్ద‌రు ఎక్క‌డికి వెళ్ళినా ఇదే మాట అంటున్నారు. మొన్న ఓ సెల్‌ఫోన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన రాంచ‌ర‌ణ్ కూడా ఇలానే అన్నారు. ఒక సినిమాని రెంత త‌క్కువ కాలంలో తీస్తే నిర్మాత‌కు అంత మంచిది అని ఇద్ద‌రూ ఒక్క‌టే డైలాగ్‌. చివ‌రికి కొర‌టాల ఏం చేస్తాడో చూద్దాం మ‌రి. 

Leave a Reply

Your email address will not be published.