గోడ మీద వార్తలు

గోడ మీద వార్తలు
09 – 01 – 2019
01  ప్రత్యే పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వొచు – ఐనా  EBC రిజర్వేషన్ బిల్లుని చట్టంగా మార్చటానికి ఏ రాష్ట్రాన్నీ సంప్రదించవలసిన అవసరం లేదు – అరుణ్ జైట్లీ …
మరేం – మనకి మనుషులతోనే పనిలేనప్పుడు ఇహ రాష్ట్రాలతో ఏం పనేటుంటాది చెప్పూ –  ఇహపోతే ప్రత్యేకతలంటావా..??? ఎన్నికలప్పుడు  పార్టీలకి సకులం ప్రత్యేకమేలే…!!
02.  కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు – సీబీఐ అధికారి అలోక్ వర్మ తొలగింపు విషయంలో ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా తీర్పు  …
బ్యాటరీ లేని బొమ్మకి రిమోటు ఎవుడి చేతిలో ఉంటే ఏందని – ఐనా ఆ సంస్థెపుడూ దారాలతో ఏళాడ దీసిన తోలు బొమ్మెగా…??
03.  కేసీఆర్ ని ఎప్పుడూ పర్సనల్ గా కలవలేదు – మొన్న ఎలక్షన్లలో గెలిచాక ఫోను మాత్రమే చేసి శుభాకాంక్షలు తెలిపాను – ఓ ఇంటర్వ్యూలో జగన్ …
ఎక్కువగా నడిచేసరికి ఎక్కడో రాలిపోయినట్టుంది –  మొన్న  గాలి జనార్ధన రెడ్డెవరో తెలీదు – నిన్న సాక్షీకి నాకూ సంబంధం లేదు ..?? ఇయాళ ఇది – ఏందో .. ఇనేటోళ్ళు ఓ మాదిరిగా కూడా కనపడతన్నట్టు లేదు అన్నియ్యకి…!! 
04.  డెబ్బై ఏళ్ళు దాటిన ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకీ మరో పది శాతం అదనపు ఫించను ఇవ్వాలని నిర్ణయించిన – ఆంధ్రా ప్రభుత్వం …
ప్రజల సొమ్ము ఫించన్ల పాలనీ – కానీయండి – ఎలక్షన్లొస్తన్నాయిగా – ఖజానా ఖాళీ చేస్తే గెలిచాక ఆలోచించొచ్చు…!!
05.  సంక్రాంతి సీజను మొదలవటంతో కోడి పందేలకీ సిద్ధమవుతున్న ప్రజలు – ఎప్పటిలానే ఆంక్షలు విధిస్తున్న అధికారులు …
ఇహ చూడండి – జీవ కారుణ్యం వంకాయంటూ ఇంట్లో రెండు లెగ్గు పీసులు లోనేసి సోషల్ మీడియా లోకి, రోడ్లమీదికి బోర్డులట్టుకు తయారవుతారు …!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!

Leave a Reply

Your email address will not be published.