హీరోయిన్‌ నిత్యాశెట్టితో ముఖాముఖి


చెందు ముద్దు దర్శకత్వంలో  విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌ రావు హీరోలుగా నిత్యాశెట్టి క‌ధానాయిక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం ‘ఓ పిట్టకథ’   భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం స‌క్స‌స్‌గా ర‌న్ అవుతున్న సంద‌ర్భంగా నిత్యాశెట్టితో ముఖాముఖి.
 
ప్రేక్షకుల మధ్య కూర్చోని వెండితెరపై న‌న్ను నేను చూసుకున్నా..
బాల నటిగా మెప్పించిన మీరు హీరోయిన్‌గా మారటం ప‌ట్ల ఎలా ఉంది?
 చాలా ఆనందంగా ఉంది.  బాలనటిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన నేను ప‌లు సినిమాల్లో న‌టించారు.  వాటితో ‘దేవుళ్లు’, ‘అంజి’ చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా  అందరికీ గుర్తుండిపోయేలా చేసాయి.  ఇక హీరోయిన్‌గా  చాలా సంతృప్తినిచ్చిన చిత్రం మాత్రం ‘ఓ పిట్టకథ’నే.  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య కూర్చోని తొలిసారి వెండితెరపై చూసుకున్నప్పుడు  ఎంత ఆనంద ప‌డ్డానో.  

వెంకటలక్ష్మీ పాత్ర కోసం బాగా కష్టపడ్డట్టున్న‌రే?
 నేను హీరోయిన్‌గా మారాల‌నుకున్న త‌రువాత భవ్య క్రియేషన్స్‌లో ఆడిషన్ చేసాను,  మరో చిత్రం కోసం కూడా ఓకే చెప్పాను. అయితే  కొన్ని కారణాలతో అవి షూటింగ్ ఆరంభ‌మ‌వ్వ‌లేదు. అలాట‌ప్పుడు ముద్దు చెందు ఫోన్‌ చేసి ఈ చిత్రం గురించి చెప్పారు. ఆయ‌న నాకు కథ చెప్పేముందు   ‘నాకు ఎన్ని సీన్లు ఉంటాయో వాటిని షూట్ చేసాక తీసేయ‌రు క‌దా? అని అడిగా…  మీ మీదే అధి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పారు. కథ మొత్తం నా చుట్టూనే తిరుగుతుండ‌టంతో  వెంకటలక్ష్మీ పాత్ర కోసం చాలా కష్టపడ్డా.  చిత్ర ముగింపు సర్‌ప్రైజ్‌గా ఉంద‌ని  నా స్నేహితులు చెపుతుంటే ఆనందం అంతా ఇంతా కాదు.

మ‌రి గ్లామర్‌ రోల్స్ చేస్తారా?
ఎందుకు చెయ్య‌నండీ !  హీరోయిన్‌గా తమిళ్‌లోనూ మూడు చేశా. తెలుగులో ఇది నా మూడో చిత్రం. గ్లామర్‌ పాత్రల న‌టించాల‌ని నాకూ ఆశ‌గా ఉంది.  నన్ను చిన్నప్పుటి నుంచి బాలనటిగా చూశారు కాబట్టి ఒకవేళ ఆ పాత్రలు చేసినా ‘ఈ అమ్మాయికి ఇలాంటి పాత్రలిచ్చేరేంటి’ అని ప్రేక్షకులు అనుకుంటారేమో అని అనుమానం ఉంది. 

బాల న‌టిగా హీరోయిన్‌గా సినిమాల‌లో న‌టిస్తున్నారు… చ‌దువుకు నామంపెట్టారా?
లేదండి, బాల నటిగా బిజీగా ఉన్నప్పుడే సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నా,  ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చా

త‌మిళంలోనూ న‌టిస్తున్నారు… ఇంత‌కీ మీ స్వ‌స్థ‌లం?
నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నేను తెలుగ‌మ్మాయినే. త‌మిళం నుంచి ఆఫ‌ర్లు బాగానే ఉన్నాయి.

ఈ సినిమా త‌దుప‌రి  మీరు చేస్తున్న‌ సినిమాలు ?
తమిళ్‌లో ఓ సినిమా  చేస్తున్నా.   తెలుగులో కొన్ని క‌థ‌లు విన్నాను ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. 

Leave a Reply

Your email address will not be published.