ర‌ష్మికకి రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో అంత గ‌ట్టిగా ఉందా…?రష్మిక మందన్న..’గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేసింది. ఐతే… అది ఒకింత నిరాశ కలిగించింది. నాని న‌టించిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రం‘జెర్సీ’. ఈ  సినిమా హిందీ రీమేక్ లో హీరోయిన్ గా ముందుగా రష్మికకే అవకాశం దక్కిందని, అయితే ఆ సినిమాలో చేయడానికి ఆమె నో చెప్పిందని వచ్చిన వార్తలపై స్వయంగా తనే స్పందించింది. తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమా హిందీ రీమేక్ లో హీరోయిన్ గా తనకే అవకాశం దక్కిన మాట వాస్తవమే అని రష్మిక ధృవీకరించింది. అందులో నటించడానికీ తను నో చెప్పిన మాట నిజమే అని రష్మిక చెబుతోంది.

అయితే అందుకు కారణం.. డబ్బులు కాదని ఆమె అంటోంది. తను భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టుగా, దాన్ని ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటంతో తను ఆ సినిమా నుంచి జారుకున్న‌ట్లు జరుగుతున్న ప్రచారాన్ని రష్మిక ఖండించింది. తను భారీ రెమ్యూనరేషన్ అడిగిన మాట వాస్తవం కాదని ఆమె చెబుతోంది.

ఇంతకీ ఆ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నట్టు? అంటే.. తను ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు న్యాయం చేయలేకపోతాననే భయంతో తప్పుకున్నట్టుగా రష్మిక చెబుతోంది. ఆ సినిమా ఒక భారీ ప్రాజెక్ట్ అని, అంత భారమైన పాత్రలో తను నటించలేనని రష్మిక అంటోంది.

అయినా ఇలాంటి రీజన్లు చెప్పే వాళ్లు తక్కువగా ఉంటారు. రష్మిక మాత్రం అలాంటి అరుదైన రీజన్ చెబుతోంది. డబ్బు తక్కువ ఇస్తారని తను ఆ సినిమా నుంచి తప్పుకోలేదని అంటోంది. బహుశా పెళ్లైన పాత్రలో నటించడానికి కూడా రష్మిక వెనుకాడి ఉండొచ్చునేమోర అని కొన్ని గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాక అందులో పెళ్లికావ‌డ‌మేకాదు ఒక బాబు కూడా ఉంటాడు క‌దా. చ‌క్క‌టి రొమాంటిక్ ప్రేమ క‌థ‌లు చేసే ఈ భామ స‌డెన్‌గా పెళ్ళై ఓ పిల్లాడికి త‌ల్లంటే బావుండ‌ద‌ని ఆలోచించి ఉంట‌ది. కాక‌పోతే మంచి క‌థ ఉంటే ఏపాత్ర‌నైనా చేసేట‌ట్లు ఉండాలి. 

Leave a Reply

Your email address will not be published.