యాత్ర రిలీజ్ ఆపాలి.. మద్రాస్ కోర్టులో కేసు

దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రం ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మమ్ముట్టి కథానాయకుడిగా మహి.వి.రాఘవ్ దర్శకత్వ ంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. అన్ని రకాల క్లియరెన్స్ వచ్చినా.. ఈ సినిమా రిలీజ్ ని ఆపాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టులో కేసు వేయడం సంచలనమైంది. వారం ముందు ఈ వివాదం తో సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు ఏర్పడనున్నాయో అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏపీ ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు తీసిన చిత్రమిదన్న వాదన పిటిషనర్ తెరపైకి తెచ్చారు. అయితే ఈ చిత్రంలో ఎలాంటి వివాదాలు ఉండవని, ఈ చిత్రం చూడడం వల్ల ఓటరు ప్రభావితం అవుతాడని అనుకోవడం లేదని దర్శకనిర్మాతలు వాదిస్తున్నారు. ఈ కేసు విషయమై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు విచారణను ఫిబ్రవరి 6 నాటికి వాయిదా వేసింది. ఆరోజు తుది విచారణ జరగనుంది. అయితే రిలీజ్ కి సరిగ్గా రెండ్రోజుల ముందు ఈ విచారణ జరుగుతుండడంతో యాత్ర టీమ్ లో కొంతమేర టెన్షన్ వాతావరణం అలుముకుంది. అయితే తాము తెరకెక్కించిన ఈ చిత్రంలో వివాదాలేవీ లేకపోవడం, ప్రత్యర్థుల ప్రస్థావన లేకపోవడంతో రిలీజ్ సాఫీగా సాగుతుందనే టీమ్ ధీమాను కనబరుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.