‘ఆర్ఆర్ఆర్’ మూవీ లో అజయ్ దేవగన్….

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అనూహ్యంగా ఈ సినిమాబడ్జెట్టే కాదు కాస్టింగ్ని పెంచి పారేస్తున్న రాజమౌళి ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ని ఎంపిక చేసిన విషయం విదితమే.
బుధవారం అజయ్ దేవగన్ హైదరాబాద్ వచ్చేసి నేరుగా రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ కు ఆహ్వానం పలుకుతూ ఆర్ఆర్ఆర్ టీమ్, సామాజిక మీడియా అకౌంట్స్ లో ‘మీ రాకకోసం మేము కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాము, మీకు ఇదే మా ఆహ్వానం’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్, దర్శకుడు రాజమౌళితో అజయ్ దేవగన్ దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. జూన్ నెలాఖరు నాటికి ఈ చిత్రం విడుదల చేయటమే లక్ష్యంగా రాజమౌళి ఎడతెరిపిలేకుండా షూటింగ్లో పాల్గొంటున్న విషయం విదితమే.