వైసీపీ కండువా కప్పుకున్న రామసుబ్బారెడ్డి

నిన్నటి వరకు టీడీపీ లోనే ఉంటానంటూ మీడియా ముందు చెప్పిన నేత రామసుబ్బారెడ్డి బుధవారం నాటికి హడావిడిగా విజయవాడ వచ్చి వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పేసుకున్నారు. కడప జిల్లాలో చేరికలు ఎక్కువగా ఉండటంతో అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించాలని వైసీపీ ఆలోచిస్తుంది. సభలోనే పార్టీలో మిగిలిన నేతలను చేర్చుకోవటం ద్వారా టిడిపిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు ఇన్నాళ్లు వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీకి దిగిన సతీష్ రెడ్డి ని కూడా పార్టీలోకి రప్పించాలని వైసిపి నేతలు మంతనాలు ఆరంభించినట్టు సమాచారం.