జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఇలా…

జయలలిత జీవిత నేపథ్యంలో ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం విదితమే. దీనిలో రమ్యకృష్ణ జయలలితగా ప్రధాన పాత్ర పోషించనుంది. జయ బాల్యాన్ని చూపించేలా రూపొందిన ఓ టీజర్ ని ఇటీవల యూనిట్ విడుదల చేయగా సామాజిక మీడియాలో మంచి పేరొచ్చింది. అయితే ఈ సీరిస్‌కి సంబంధించినట్రైలర్ని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు దర్శకుడు మీనన్ మీడియాకు చెప్పారు.
ఓవైపు కంగనా ప్రధాన పాత్రగా ఓ బయోపిక్ రూపొందుతూ, ఆ చిత్ర స్టిల్స్, సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తుంటే, మరోవైపు నిత్యామీనన్‌తో కూడా ఓ బయోపిక్ రడీ అవుతోంది. దీనిపైనా కొన్నిక్రియేటెడ్ స్టిల్స్ మెచ్చుకోలుగా ఉన్నాయి.
అయితే జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్‌లో జయ పాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ స్టిల్స్ ఫేస్ రివీల్ ఇప్పటివరకు చేయని మేకర్స్. తాజాగా జయలలిత పాత్రలో రమ్య కృష్ణకు సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదల చేసారు. ఇవన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రమ్యకృష్ణ అమ్మ పాత్రలో అందరినీ ఆకట్టుకునేలా ఉంది