రిస్క్ చేస్తేనే ఫలితమంటున్న పంజాబీ బ్యూటీ

ఏ ప్రాంతానికి వెళితే అక్కడి అమ్మాయిలాగా మారిపోయి వాళ్ళతో కలిసిపోతానంటుంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్ సింగ్. పెరిగిందంతా ఢిల్లీలోనేనని.. సినీ జీవితం మాత్రం దక్షిణాదిలోనే ప్రారంభమైందని చెప్పింది. సైనిక కుటుంబం కావడంతో దేశం మొత్తం చుట్టి వచ్చానని తెలిపింది. తన చిన్న వయసులో కుటుంబసభ్యులు వేరే ఊరుకు వెళ్లితే.. అక్కడి పరిస్థితులకనుగుణంగా ఉండేవారు. అయితే తాను అలా కాదు, ఎవరితోనైనా చక్కగా కలిసిపోతానని ..అందరితోనూ కలగలుపుగా ఉంటానని చెప్పింది.
ఏ ప్రాంతానికి వెళ్లినా బిడియ పడను. కొత్త వారైనా మాట్లాడతానని అంది. అలా కాకుండా భయపడితే ఏమీ చేయలేమని అంది. నేనొకభారతీయురాలినన్న భావన తనకు ఎప్పుడూ ఉందని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పింది.
అలాగే ‘హిందీ పరిశ్రమ షూటింగ్ ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా మనం కాంటాక్ట్‌లో ఉండాలని కోరుకుంటుంది. అదే సౌత్‌లో అయితే మన తరఫున మన మేనేజర్లే సినిమాకి సంబంధించిన విషయాలను మాట్లాడతారు.. అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. అంటే… అవకాశాలు తెచ్చుకోవాలంటే బాలీవుడ్లో పార్టీలంటూ అందరికీ టచ్‌లో ఉండాలన్నది మీ ఉద్దేశమా? అనే ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ…‘‘నా ఉద్దేశం అది కాదు. పార్టీలకు వెళితే ఎవరూ పని ఇవ్వరు. టాలెంట్ ముఖ్యం. అయితే కాంటాక్ట్‌లో ఉండటంవల్ల.. మనం ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటామో అలాంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే అది కూడా టాలెంట్ ఉన్నవాళ్లకే. ఇప్పుడు ‘కంటెంట్’ ఉన్న సినిమాలకే క్రేజ్… అలాంటి సినిమాల్లో నటించాలంటే టాలెంటెడ్ ఆర్టిస్టులు కావాలి. మనం టాలెంటెడ్ అయితే పార్టీలకు వెళ్లినా.. వెళ్లకపోయినా కచ్చితంగా అవకాశాలు వస్తాయి. అయితే కొంచెం సమయం పట్టొచ్చు.మన స్థానం మనకు ఉంటుంది’’ అని చెప్పింది.
చిత్రసీమలో రిస్క్‌లకు సిద్ధపడ్డప్పుడే ఆశించిన ఫలితాల్ని సాధిస్తాం. మన గురించి ఇతరులు ఏమనుకుంటారో అని పట్టించుకోవద్దు…అని చెబుతున్నది పంజాబీ నాయిక. ‘మర్జావన్’లో వేశ్య పాత్రలో తన కెరీర్లో తొలిసారి సవాలుతో కూడిన పాత్ర చేస్తున్నానని.. ‘మర్జావన్’ నటిగా తనను మరో మెట్టెక్కించే చిత్రమవుతుందని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్.