గెలిపిస్తే – ఖంఠం కోసిస్తా : పవన్

వ్యవస్థ ఏదైనా అవినీతి సాధారణంగా మారిందని .. దానిని భోగి మంటల్లో వేసి దహనం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు…  
ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రశ్నించాలని ,ప్రజల కోసం ఏ త్యాగానీకైనా సిద్ధమని  తనకు ఓటేసి గెలిపిస్తే మెడ కోసి ఇవ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. 


గుంటూరు జిల్లా తెనాలిలోని పెదరావూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ ప్రజలకు కావాల్సింది రూ. 2 వేల ఫించను, 25 కిలోల బియ్యం కాదని, పాతికేళ్ల బంగారు భవిష్యత్తని స్పష్టం చేశారు. వచ్చే నెల 2న రైతులతో సమావేశమై వారి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించి జనసేన మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. దేశానికి వెన్నెముకలాంటి రైతులు ఇక కష్టపడడానికి వీల్లేదన్నారు.


ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకునేందుకు అక్కడి యువత రోడ్ల మీదకు వచ్చి పోరాడారని, అదే స్ఫూర్తితో ఏపీ యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published.