గోడ మీద వార్తలు

01 . అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ వెబ్ సైట్ లో తమ అభ్యర్ధుల నేర చరిత్రని వివరం గా పొందుపరచాలని ఆదేశించిన – సుప్రీం కోర్టు …
వార్నీ –  మీ లా స్టూడెంట్లకి రివిజన్ చేయాల్సిన కేస్ స్టడీసన్నీ  ఒక్కచోటే దొరికేస్తాయనా …?? ఆశ …!!
02. ఐదేళ్ళ లోపు పిల్లలకి బులుగు రంగులో కొత్త రకం ఆధార్ కార్డులు – ఐదేళ్ళు నిండాక బయోమెట్రిక్ సిస్టం ఆధార్ …
ప్రభుత్వాలు పెద్దయ్యాక బ్రతుకు తెరువుకి ఏ ఆధారాలు చూపెట్టలేకపోయినా – జీవితాంతం ఈ ధారం తప్పదుగా …!!
03. 75% లోకల్ రిజర్వేషన్లపై కర్ణాటకలో ఆందోళనలు – పలుచోట్ల బస్సులపై దాడి …
ఇస్తామని హామీ ఇచ్చాక ఆందోళనలేంట్రా సామీ – ఇవ్వొద్దనా మీ శ్లేష…??
04. పలువురు కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు – దొరికిన సొమ్మంతా చంద్రబాబు బినామీలదే అంటూ కథనాలు …
నిజమైతే ఏముందిలే – ఆయనకీ ఓ వారం కేటాయించి కాలక్షేపం చేస్తారు …!!
05. ఆంధ్రా నుండి తెలంగాణకి అక్రమంగా తరలిపోతున్న ఇసుక – పట్టుకున్న తనికీ అధికారులు …
ఇసుకే లేదని ఇక్కడ రచ్చ చేస్తంటే పక్క స్టేటుకీ పట్టుకెళ్ళటానికి ఈళ్ళకెక్కడ దొరికిందబ్బా …??
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 

Leave a Reply

Your email address will not be published.